For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీరలో కాజల్ క్యారెక్టర్?

    By Staff
    |

    మగధీర ఆడియో రిలీజ్ ఐన దగ్గర్నించి ఆ సినిమా హైలైట్ లపై అంతటా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. ఆమె క్యారెక్టర్ ఫస్టాఫ్ లో ప్యాషన్ డిజైనర్ గా, సెకెండాఫ్ లో రాకుమార్తెగా కనపడుతోంది. రాజస్ఠాన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పునర్జమన్మ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. శ్రీహరి సైతం ఈ చిత్రంలో కీలకమైన పాత్ర చేసారని వినికిడి. గీతా ఆర్ట్స్ పై గజనీ తర్వాత ఎక్కువ బడ్జెట్ లో నిర్మితమైన చిత్రం ఇదేనని తెలుస్తోంది. అలాగే చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ ఘరానామొగుడు లోని బంగారు కోడి పెట్ట పాట ను ఈ చిత్రంలో రీమిక్స్ చేసారు. అంతేగాక చిరంజీవి సైతం తన కుమారుడుతో కలిసి స్టెప్స్ వేసి తన అభిమానులను అలరించనున్నారు. ఇక ఇప్పటివరకూ ఒక్క ప్లాప్ కూడా లేని రాజమౌళి డైరక్ట్ చేయటంతో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.

    అలాగే చరణ్ స్టంట్ మేన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పునర్జన్మల చుట్టూ తిరిగే ఈ కథ ప్రకారం చరణ్ ఈ కాలంలో ఫైట్స్ చేస్తూ బ్రతికుతూంటాడు. అక్కడ ఫ్యాషన్ డిజైనర్ గా వచ్చిన కాజల్ పరిచయమవుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే గతంలో దాదాపు 400 సంవత్సరాల క్రిందటే వీరి ప్రేమ మొలకెత్తుతుంది. అప్పుడు శ్రీహరి పాత్ర వల్ల వీరు విడిపోతారు. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు మధ్య మరో రకమైన శక్తులు అడ్డుపడతాయి. ఈ జన్మలో శ్రీహరి వీరిని కలపటానకి ప్రయత్నిస్తాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X