మహేష్ ‘బిజినెస్’తో మళ్ళీ టాప్ హీరోయిన్ రేంజ్ కి వచ్చేసింది...!?
బాలీవుడ్ కు వెళ్లి ఈ మధ్య కాలంలో టాలీవుడ్, కోలీవుడ్ ల్లో ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్న కలవ కన్నుల కాజల్ తాజాగా వరుస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వరుస సినిమాలతో ప్రేక్షకులకు తన సత్తా చూపించాబోతుంది. లక్ష్మీకల్యాణం చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ 'చందమామ'తో అందరి దృష్టిలో పడింది. మగధీర' చిత్రంతో తెలుగులో తారాస్థాయికి దూసుకుపోయింది కాజల్. ఆ తర్వాత మిస్టర్ ఫర్ ఫెక్ట్, బృందావనం సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న కాజు కన్ను బాలీవుడ్ పై పడింది. అయితే అక్కడ కాలం కలిసి రాకపోవటంతో బ్యాక్ టూ పెవిలియన్ పట్టింది.
అనంతరం తెలుగులో అవకాశాలు రాకపోవటంతో ఇక కాజల్ కెరీర్ ముగిసిపోతుందంటూ వార్తలు కూడా ఊపందుకున్న సమయంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న బిజినెస్ మెన్ చిత్రంలో మహేష్ బాబు సరసన అవకాశం దక్కించుకుంది. మగధీర రిలీజ్ అయిన తరువాత టాప్ హీరోయిన్ అయితే బిజినెస్ మెన్ సినిమాలో బుక్ అయిన నాటి నుంచే కాజల్ రేంజ్ పెరిగిపోయింది. బిజినెస్ మెన్ లో నటిస్తుందని తెలిసినప్పటి నుంచి అమ్మడి వెనుక నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ప్రస్తుతం మహేష్ తో బిజినెస్ మెన్ కాకుండా కోలీవుడ్ లోనూ ఈ అమ్మడికి ఇద్దరు టాప్ హీరోల సరసన నటించే ఛాన్సు దక్కింది. సెవెన్త్ సెన్స్ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించే సినిమాలో ఆమె విజయ్ సరసన నటించనుంది. అలాగే కెవీ ఆనంద్ డైరెక్షన్లో సూర్య నటించబోయే చిత్రంలోనూ కాజలే హీరోయిన్. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఈ మూడు చిత్రాలు హిట్ అయితే అమ్మడి ఇమేజ్ అమాంతం పెరిగిపోవటం ఖాయం. వరుసగా స్టార్స్ తోనూ, స్టార్ డైరక్టర్లతోనూ సినిమాలు చేస్తూ మరో సారి సౌత్ లో టాప్ హీరోయిన్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











