నాకు ఆమే పోటీ ఇస్తుంది: కాజల్
కాజల్ ఇప్పుడు తన చెల్లెలు నిషా అగర్వాల్ ని చూసి మురసిపోతోంది. ఆమె తాజా చిత్రం ఈ శుక్రవారం తమిళంలో మొదలైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాజల్..తన చెల్లెలు తనకు పోటీ ఇచ్చే స్ధాయికి త్వరలోనే చేరుకుంటుందని భావిస్తున్నానని తెలిపింది. అలాగే మరి మీ చెల్లికి ఏమైనా టిప్స్ ఇచ్చారా అంటే..ఆమె తనంతట తానే దారి వేసుకుంటూ దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పింది. అలాగే తన చెల్లెలు చాలా హార్డ్ వర్క్ చేస్తుందని, తన కన్నా ట్యాలెంట్ ఉన్న అమ్మాయని పొగిడింది.
అలాగే ఆమె సూర్య సరసన నటించే తాజా చిత్రం శుక్రవారం మొదలైంది. ఆ విషయాన్ని ప్రస్దావిస్తూ.. సూర్య అద్బుతమైన నటుడు. కార్తీక్ లాగానే ఆయన కూడా నటించరు.. జీవిస్తారు. కెమెరా ముందుకు రాకముందు వరకే వారు మామూలు వ్యక్తులు. ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చారా..వారి విశ్వరూపం చూపిస్తారు. కెవీ ఆనంద్ లాంటి గొప్ప దర్శకుడు, సూర్య లాంటి అద్బుతమైన ఆర్టిస్టుతో సినిమా చెయ్యటమంటే మాటలు కాదు. కార్తీతో చేస్తున్నప్పుడే ఈ కోరిక తీరాలని కోరుకున్నాను. ఇది ఇప్పుటికి నెరవేరింది అంది.


Click it and Unblock the Notifications











