కాసినోలో కాజల్ అగర్వాల్... జూదం ఆడుతూ కెమెరాకు చిక్కిన బ్యూటీలు.. మరో హీరోయిన్ ఎవరంటే!

సాధారణంగా ఆటవిడుపు కోసం సినీ తారలు ఏదో గేమ్ ఆడటమో.. వెకేషన్స్‌కు వెళ్లడమో జరుగుతుంటుంది. వరుస సినిమాలతో దక్షిణాదిని ఊపేస్తున్న కాజల్ అగర్వాల్ మాత్రం ఏకంగా కాసినో‌కు వెళ్లి కెమెరాకు చిక్కింది. కెసినో మంచి జోష్‌తో కాజల్ జూదం అడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకు ఎక్కడ ఎప్పుడు.. ఎందుకు కాసినో ఉందే తెలుసుకోవాలంటే అసలు విషయం తెలుసుకోవాల్సిందే.. వివరాల్లోకి వెళితే..

థెరీ మూవీ రీమేక్‌ కోసం

థెరీ మూవీ రీమేక్‌ కోసం

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ఆమె థెరీ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కోసం వెళ్లిన కాజల్ ఆట విడుపుగా కాసినోకు వెళ్లినట్టు తెలిసిందే. తన వెంట ఆమె తండ్రి కూడా ఉన్నట్టు సమాచారం.

కాసినో టేబుల్‌పై ఫుల్ జోష్‌గా

కాసినో టేబుల్‌పై ఫుల్ జోష్‌గా

కాసినో టేబుల్ ముందు కాయిన్స్ పెట్టుకొని కాజల్ హంగామా చేసినట్టు కనిపించింది. ఆమె వెంట సంజన కూడా ఉండటం గమనార్హం. కాసినోలో ఆటతోపాటు పాటకు స్టెప్పులు కూడా వేసినట్టు తెలుస్తున్నది. ఇలా షూటింగ్ ఒత్తిడి నుంచి బయటపడటానికి కాజల్ భారీగానే డబ్బు పెట్టి కాయ్ రాజా కాయ్ అన్నట్టు కెమెరాకు దొరికింది.

కస్టమర్స్‌తో మాటామంతికి పారితోషికం

కస్టమర్స్‌తో మాటామంతికి పారితోషికం

కాసినోలో ఆటతోపాటు ప్రమోషన్ కార్యక్రమంలో కూడా పాల్గొని రెమ్యునరేషన్ కొట్టేసినట్టు మరో విషయం తెలిసింది. శ్రీలంకలోని ప్రముఖ కాసినో క్లబ్‌లో కస్టమర్లతో మాట్లాడే కార్యక్రమంలో కాజల్ పాల్గొని వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.

గతంలో సినీ తారలు

గతంలో సినీ తారలు

ఇక తెలుగు పరిశ్రమలో సినీ తారలు జూదం ఆడటం కొత్తేమీ కాదు. సావిత్రి నుంచి నేటి యువ తారల వరకు జూదం ఆడటంలో దిట్ట అనేది తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు నేరు నేను కాసినోలో జూదం ఆడుతాను అని చెప్పడం తెలిసిందే. ఇటీవల మహేష్ బాబు కూడా కాసినో కనిపించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X