'లక్స్ పాప' అవతారమెత్తుతున్న కాజల్
లక్స్ యాడ్‌లో కనిపించటం అంటే హీరోయిన్స్ ఓ మెట్టు ఎక్కినట్లు భావిస్తూంటారు. అందుకోసం హీరోయిన్స్ పోటీ పడుతూంటారు. ఆ క్రమంలో ఇప్పుడు కాజల్ కి అవకాసం వచ్చింది. ఒకప్పటి అగ్రనటి లీలా చిట్నీస్ నుంచి నేటి కరీనాకపూర్ వరకు ఎందరో ప్రముఖ హీరోయిన్స్ జలకాలాడిన 'లక్స్' సబ్బు వాణిజ్య ప్రకటనలో తాజాగా కాజల్ అగర్వాల్ కనిపించనుంది. గతంలో లక్ష్మి, హేమమాలిని, శ్రీదేవి, మాధవి, రేవతి, గౌతమి, సిమ్రాన్, శ్రియాశరణ్, ఆసిన్ తదితర ప్రముఖ హీరోయిన్లంతా 'లక్స్ పాప'లుగా అలరించినవారే. ప్రస్తుతం కాజల్...పూరీ దర్శకత్వంలో ది బిజినెస్ మ్యాన్ సినిమా చేస్తోంది.ముంబై నేపథ్యంలోసాగే మాఫియా కథ 'ది బిజినెస్‌మ్యాన్'.
ఇంతవరకూ మహేష్ బాబు చేయనటువంటి పాత్ర ఇది. 'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











