twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక్కడ దడతో అక్కడ గిరాకీ పెంచుకుంటున్న మిత్రవింద!

    By Bojja Kumar
    |

    దక్షిణాదిన వరుస విజయాలతో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కాజల్...ఇటీవల సింగం సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సింగం సినిమా హిట్ కావడం కాజల్‌కు కలిసి వచ్చింది. ఇప్పడు ఆమె బాలీవుడ్‌లో ఫుల్ బిజీ.

    పూరి జగన్నాథ్ అభిషేక్ బచ్చన్‌తో రూపొందించ బోతున్న...ది బిజినెస్ మాన్ సినిమాలో కాజల్ మెయిన్ హీరోయిన్ పాత్ర ఇవ్వాలని నిర్ణయించాడు. ఆ సినిమా తెలుగు రీమేక్‌లో కూడా మహేష్ బాబు అవకాశం దక్కించుకుంది కాజల్. అదే విధంగా కాజల్ హీరోయిన్ గా వచ్చిన 'నా పేరు శివ" తెలుగు, తమిళంలో సూపర్ హిట్ కావడంతో...బాలీవుడ్ నిర్మాతలు దాన్ని హీందీలో రీమేక్ చేయడానికి హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాః

    హిందీ రీమేక్ లో కూడా కాజల్‌ను తీసుకోవడానికే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారట. మరో వైపు కాజల్ చేతిలో 'మాత్రన్" అనే తమిళ సినిమా కూడా ఉంది. కెవి ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సూర్య హీరో. మరో వైపు నాగ చైతన్య, కాజల్ జంటగా నటించిన 'దడ" సినిమా గురువారం విడుదలైంది.

    English summary
    Kajal Agarwal is now not only the hot property of Tollywood and Kollywood but in Bollywood too the actress is turning busy post to the success of her debut film Singham. The pretty lass is currently on a verge of signing yet another mega project in Bollywood, while one more interesting offer is also on the pipeline.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X