సౌత్ ఇండస్ట్రీలో బ్యాన్ అనేసరికి ప్లేటు ఫిరాయిస్తోన్న కాజల్..!?
'లక్ష్మీకల్యాణం'తో పరిశ్రమలోకి అడుగుపెట్టి 'చందమామ'తో తొలి సక్సెస్ ను సాధించిన కాజల్ కెరీర్ 'మగధీర' సంచలన విజయంతో తారాజువ్వలా అగ్రపథాన దూసుకుపోతోంది. పలువురు అగ్రహీరోలు, దర్శకుల చిత్రాలతో కాజల్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఇటు తెలుగు, అటు తమిళం, ఇప్పుడు హిందీలో బాగా క్రేజ్ తెచ్చుకొన్న తార కాజల్.
ఇటీవల ముంబాయ్ మీడియాతో నేను సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ ని కాదు అని కాజల్ అగర్వాల్ చెప్పడం పెద్ద వివాదం అయ్యింది. ఇక్కడి దర్శక, నిర్మాతలు కాజల్ ని ఎంకరేజ్ చేయకూడదని ఫిక్స్ అవుతున్నారట. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కాజల్ అగర్వాల్ నోరు విప్పింది. అసలేం జరుగుతోంది" అని కాజల్ అగర్వాల్ అంటూంది. వివరాల్లోకి వెళితే ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ పై సౌతిండియన్ సినిమా వారు బ్యాన్ పెట్టబోతున్నారట అనే సమాచారం తెలుసుకొన్న కాజల్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తోంది.
'నేను ముంబాయ్"లో పుట్టాను కాబట్టి..ముంబాయ్ అమ్మాయిని అన్నాను. అంతకు మించి నేనేం అనలేదు. నేను పుట్టింది ముంబాయ్ లో అయినా నటిగా మాత్రం, పుట్టి, పెరుగుతున్నది సౌత్ లోనే. దక్షిణాది పరిశ్రమ అంటే నాకెంతో ఇష్టం ఇక్కడి పరిశ్రమను నేను దుర్భాషలెందుకు ఆడతాను? నా మాటలను వక్రీకరించవద్దు" అని విన్నవించుకుంది..


Click it and Unblock the Notifications











