Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
సినిమా మొత్తంపై స్త్రీ పాత్ర నాదొక్కటే : కాజల్
ముంబై : ''చిత్రంలో 26 పురుష పాత్రలుంటాయి. సినిమా మొత్తానికి స్త్రీ పాత్ర నాదొక్కటే. నిజంగా ఇలాంటి చిత్రం చేయడం కొత్తగా అనిపిస్తోంది'' అంటూ మురసిపోతోంది కాజల్. కాజల్ హిందీలో 'స్పెషల్ ఛబ్బీస్' అనే చిత్రం ఒకటి చేస్తోంది. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరో. ఇందులో ఉపాధ్యాయురాలిగా కనిపించబోతోంది. అందులో కొత్తదనం ఏమిటి అంటే సినిమా మొత్తంపై ఆమె ఒకత్తే మహిళ కావటం.
అలాగే... ''నటిగా నేను ఎంచుకొనే పాత్రలు నాకు మాత్రమే కాదు... ప్రేక్షకులకీ నచ్చాలి. భలే ఉందే? కొత్తగా అనిపించింది లాంటి భావన వాళ్లలో కలిగితేనే నాకు ఆనందం. 'సింగమ్', 'స్పెషల్ ఛబ్బీస్' చిత్రాలు నాలో మార్పుని తీసుకొచ్చాయి. అజయ్ దేవగణ్, అక్షయ్ లాంటి పెద్ద హీరోలతో చేయడం ద్వారా నటనపరంగా కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. నన్ను నేను మార్చుకొనేందుకు వారి సూచనలు ఉపయోగపడుతున్నాయి'' అని తెలిపింది.
తెలుగులో నెంబర్ వన్ రేసులో ఉన్న హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. ఆమె తెలుగు మాత్రమే కాక,తమిళంలోనూ తన హవా నడిపిస్తోంది. తాజాగా ఆమె ఓ ట్రైలింగ్వువల్ చిత్రం ఓకే చేసింది. ప్రముఖ చాయాగ్రాహకుడు రవి.కె.చంద్రన్ దర్శకుడుగా మారుతూ డైరక్ట్ చేయనున్న చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ చిత్రం తమిళ,తెలుగు,హిందీ భాషల్లో రూపొందనుంది. ఈ చిత్రంలో జీవా హీరోగా చేయనున్నారు. ఈ మేరకు ఆమెకు భారి రెమ్యునేషన్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ తాను కలలో కూడా ఊహించలేదని అంటోందామె.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ''ఈ దీపావళి వెలుగులన్నీ నావే. పండగకి అటుఇటుగా తమిళంలో నేను నటిస్తున్న 'తుపాకీ' విడుదలవుతుంది. ఆ తర్వాత వరుసగా నేను నటించిన తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి'' అంది కాజల్. ఆమె తెలుగులో బాద్షా, ఎవడు,నాయక్ చిత్రాల్లో చేస్తోంది. నాయక్ చిత్రం మొదటి రిలీజ్ కానుంది. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందే నాయిక్ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.