మళ్లీ అందరినీ బుట్టలో వేసిన సెక్సీ పాప!
రామ్ చరణ్-కాజల్...'మగధీర' ఇండస్ట్రీ రికార్డులు బద్దలు, జూ ఎన్టీఆర్-కాజల్ 'బృందావనం' సూపర్ హిట్...ఈ నేపథ్యంలో మళ్లీ ఆవిడతో అయితేనే హిట్ వర్కౌట్ అవుతుందని భావించారో ఏమో గానీ టాలీవుడ్ యువ హీరోలు జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజలు కాజల్ పై కన్నేశారు. కళ్లు తిప్పుకోని అందం, మంచి నటనతో ఆకట్టుకుంటున్న ఈ భామ జూ ఎన్టీఆర్- శ్రీనువైట్ల సినిమాలో, రామ్ చరణ్-వినాయక్ సినిమాల్లో బుక్కయింది.
ప్రస్తుతం కాజల్ నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా కాకుండా ఈ అమ్మడు తమిళంలో సూర్య సరసన మంత్రన్ సినిమాలో నటిస్తోంది. రంగం సినిమా దర్శకుడు కె.వి.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దడ, వీర చిత్రాలతో తెలుగులో వరుస ప్లాపులు ఎదుర్కొన్న కాజల్.....అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటోంది. టాలీవుడ్ నెం.1 స్థానాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడుతోంది.


Click it and Unblock the Notifications











