ఆ సెక్సీ బ్యూటి ఇన్స్ పిరేషనే కాని టార్గెట్ కాదు: కాజల్
టాలీవుడ్ లో తెరపై దుమ్మురేపిన అందగత్తేలు ఈ మధ్య బాలీవుడ్ వాలిపోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. కొంతమంది తెలుగు తారలు హిందీలోకి అడుగుపెట్టి, ఆ తాకిడికి తట్టుకోలేక మరి సరిపడ సరుకు లేకో తిగిరి టాలీవుడ్ దారి పట్టినోళ్ళు ఉన్నారనుకోండి..ప్రస్తుతం కాజల్ బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది.
సౌత్ నుంచి బాలీవుడ్ కి ఏ అమ్మాయి వచ్చినా వాళ్ల మీద అసిన్ ఓ లుక్కేసి వుంచుతోందట. ఎందుకంటే, వాళ్లు తనకెక్కడ పోటీ అవుతారో అన్నది ఆమె భయమట. కండలవీరుడు సల్మాన్ ఖాన్ సహాయంతో ఇప్పటికే అసిన్ బాలీవుడ్ లో పాతుకుపోయిన సంగతి విదితమే.ఇదే విషయంపై అసిన్ కల్పించుకోని సౌత్ నుంచి ఏ హీరోయిన్ వచ్చినాసరే..నన్ను టార్గెట్ చేసి మాట్లాడటం తగదని మండిపడుతోంది. సౌత్ నుంచి ఏ హీరోయిన్ వచ్చినాసరే..నన్ను టార్గెట్ చేసి మాట్లాడటం తగదని మండిపతోంది. టాలీవుడ్ నుంచి ఎంత మంది వచ్చినాసరే నా పవర్ నాకే ఉంటుందని అంటోంది అసిన్. ఇప్పుడు కాజల్ ని చూసి కూడా అసిన్ అలాగే ఫీలవుతోందని అంటున్నారు. తమిళంలో హిట్ అయిన 'సింగం' సినిమా ద్వారా కాజల్ బాలీవుడ్ కి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ తెగ రెచ్చిపోయి గ్లామరస్ గా నటించిందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా ఈ నెల 22 న రిలీజ్ అవుతోంది. ఇది హిట్ అయితే కనుక కచ్చితంగా కాజల్ తనకి పక్కలో బల్లెం అవుతుందని ఆమె భయపడుతోందని అంటున్నారు.
ఇదే విషయం కాజల్ వద్ద ప్రస్తావిస్తే, లైట్ తీసుకుంది. 'మా లాంటి వాళ్లకు అసిన్ ఇన్స్ పిరేషన్. ఆమెకు నేను పోటీ ఏమిటి?' అంటోంది కాజల్. అయితే, పైకి కాజల్ ఇలా అంటున్నా, తను చేయాల్సింది మాత్రం సైలెంట్ గా అప్పుడే చేసేస్తోందని బాలీవుడ్ సమాచారం. హీరోలతో రిలేషన్స్ మెయిన్ టైన్ చేయడంలో అసిన్ కి ఈ అమ్మడు ఏమీ తక్కువ కాదని అంటున్నారు. ఏమైనా, త్వరలోనే అసిన్ కి కాజల్ గట్టి పోటీదారవుతుందనే చెప్పాలి!


Click it and Unblock the Notifications











