ఇప్పుడు ఆ దశలోనే ఉన్నా: కాజల్
హైదరాబాద్ : ''ఎవరైనా ప్రారంభ రోజుల్లో అవకాశాలపైనే ఎక్కువగా దృష్టిపెడుతుంటారు. కొన్నాళ్లయ్యాక వృత్తిని, పోషిస్తున్న పాత్రల్ని ఆస్వాదిస్తుంటారు. ఇప్పుడు ఆ దశలోనే నేనున్నాను. ఆయా పాత్రల్ని పూర్తిగా ఆస్వాదిస్తూ పనిచేస్తున్నాను. అందుకు తగ్గట్టుగానే ఫలితాలొస్తున్నాయి. తెరపై నన్ను నేను చూసుకొంటూ ఎంత ముచ్చటపడిపోతుంటానో'' అంటూ చెప్తోంది కాజల్. 'స్పెషల్ ఛబ్బీస్', 'తుపాకీ' చిత్రాల్లో పోషించిన పాత్రలు కాజల్‌కి చాలా నచ్చాయట. ఇప్పుడు 'జిల్లా' అనే తమిళ చిత్రంలో కాజల్ పోలీసుగా నటిస్తోంది.
అలాగే ...''నటిగా రకరకాల పాత్రలు పోషించాల్సి ఉంటుందని నాకు తెలుసు. అయితే ఇటీవల లభిస్తున్న పాత్రల్ని మాత్రం ఊహించలేదు. 'స్పెషల్ ఛబ్బీస్'లో ఉపాధ్యాయురాలిగా, 'తుపాకీ'లో బాక్సర్‌గా నటిస్తున్నప్పుడు ఎంతగా ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు 'జిల్లా'లో పోషిస్తున్న పోలీసు పాత్ర కూడా అదే తరహా అనుభవాన్నిస్తోంది.'' అంది కాజల్.
నిజానికి ఇదివరకటితో పోలిస్తే కాజల్ చేతిలో పెద్దగా అవకాశాలేమీ లేవు. మొన్నటిదాకా క్షణం ఖాళీ లేకుండా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తమిళంలో మాత్రమే నటిస్తోంది. అయినా సరే... చాలా సంతోషంగా ఉందని చెప్తోంది. కారణమేమిటని ఆరాతీస్తే... వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశాలు ఇటీవలే ఎక్కువగా లభిస్తున్నాయని చెప్పుకొస్తోంది.. వృత్తిపరంగా ఆనందాన్ని ఇప్పుడే పొందుతున్నానని చెబుతోంది.
'జిల్లా' సినిమా వివరాల్లోకి వెళితే ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో విజయ్, మోహన్ లాల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్.టి.నీసన్ దర్శకత్వం వహిస్తుండగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బేనర్‌పై ఆర్.బి. చౌదరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2014లో సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు కాజల్ 'ఆల్ ఇన్ ఆల్ అఝగు రాజా' అనే మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. స్టూడియోగ్రీప్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈచిత్రంలో కార్తీ హీరో. ఎం.రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications












