చివరకు కాజల్ కూడా పెంచేసి ఇలియానాకు పోటీ ఇస్తోంది
వరసగా శక్తి, నేనూ నా రాక్షసి చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డాం అనటంతో ఇలియానా పరిస్ధితి అయోమయంలో పడింది. దాదాపు కోటిన్నర పెంచేసి ఆమే రెమ్యునేషన్ లో టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే తాజాగా ఆమెకు పోటిగా కాజల్ రెడీ అయింది. మగధీర చిత్రంతో ఓ రేంజికి వెళ్ళిన కాజల్ ఆ తర్వాత బృందావనం ఇప్పుడు మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలు హిట్టవటంతో తన రెమ్యునేషన్ ని కోటి రూపాయలను దాటేసింది. అటు ప్రక్క అవసరాన్ని బట్టి ఆమె కోటిం పావు, కోటిన్నర అన్నట్లు మాట్లాడుతోంది. ప్రస్తుతం కాజల్ ..నాగచైతన్య సరసన డ్రీమ్ గర్ల్ చిత్రంలో అజయ్ భుయాన్ దర్శకత్వంలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే పవన్ సరసన గబ్బర్ సింగ్ చిత్రంలోనూ, రవితేజ సరసన వీర చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.


Click it and Unblock the Notifications











