వావ్...కాజల్ సెక్సీ షేపులు అదిరాయి (ఫోటో)
హైదరాబాద్ : హీరోయిన్ కాజల్ ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. 'బాద్ షా' చిత్రం తర్వాత ఆమె తెలుగులో ఏ ప్రాజెక్టూ కూడా ఓ చేయలేదు. ఫోకస్ అంతా తమిళ సినిమాల మీదనే పెట్టింది. ప్రస్తుతం 'జిల్లా' అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కాజల్ స్టిల్ ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ ఫోటోలో ఎక్స్ పోజింగు ఏమీ లేక పోయినా.... కాజల్ బాడీ షేపులు అభిమానులకు మత్తెక్కిస్తుండటంతో ఆమె సెక్సీ ఫిగర్‌ను అలాగే గంటల తరబడి చూస్తూ ఉండి పోతున్నారట. కాజల్ ఇంత అందంగా కనిపించడానికి ఆమె ధరించి డ్రెస్సే అని, ఆమెకు పర్ ఫెక్టుగా సూటయిందని, ఇందులో ఎంతో అందంగా కనిపిస్తుందని అంటున్నారంతా.
సినిమా వివరాల్లోకి వెళితే ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో విజయ్, మోహన్ లాల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్.టి.నీసన్ దర్శకత్వం వహిస్తుండగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బేనర్‌పై ఆర్.బి. చౌదరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
2014లో సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు కాజల్ 'ఆల్ ఇన్ ఆల్ అఝగు రాజా' అనే మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. స్టూడియోగ్రీప్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈచిత్రంలో కార్తీ హీరో. ఎం.రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications












