నాభి కింద చీర.. నా సామి రంగా!: కల్యాణ్ రామ్‌తో కాజల్ కేక పుట్టించింది..
Recommended Video

తెర మీద హీరోను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు కానీ.. హీరోయిన్లు మాత్రం ఎప్పటికప్పుడు మారిపోవాల్సిందే. అటు ప్రేక్షకులు, ఇటు నిర్మాతలది అదే మెంటాలిటీ. కాస్త పాత ముఖమైతే చాలు.. అబ్బే ఇంకేం చూస్తాం ఆ హీరోయిన్‌ను అనేస్తారు!. అందుకే హీరోల లాగా సుదీర్ఘ కాలం హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఆషా మాషీ కాదు. అయితే గ్లామర్ లేదా టాలెంట్‌తో ఒక్కోసారి దీన్ని అధిగమించవచ్చు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.

గ్లామర్ డాల్:
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లే గడుస్తున్నా.. కాజల్ అగర్వాల్ డిమాండ్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి. దానికి కారణం.. ఆమె గ్లామరే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. కెరీర్ ఆరంభంలో ఎలా ఉందో.. ఇప్పుడూ అదే ఫిజిక్‌తో కనిపిస్తుంటుంది కాజల్. అలా గ్లామర్‌ను కాపాడుకుంటూ వస్తుంది కాబట్టే కొత్త అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఎక్స్‌పోజింగ్‌కూ రెడీ..:
గ్లామర్‌గా ఉండటమే కాదు.. ఎక్స్‌పోజింగ్‌కు వెనకడుగు వేయకపోవడం కూడా కాజల్‌కు కలిసొచ్చే అంశం. తాజాగా హీరో కల్యాణ్ రామ్ తో చేస్తున్న మూవీలోనూ కాజల్ గ్లామర్ డోసు పెంచినట్టుగానే కనిపిస్తోంది. నాభి కింద చీర కట్టి కల్యాణ్ రామ్‌తో కలిసి ఆమె స్టెప్పులేస్తున్న ఆమె ఫోటో ఒకటి తాజాగా బయటకొచ్చింది. కాజల్ నడుం అందాలకు కుర్రకారు ఫ్లాట్ కావడంతో.. ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

అచ్చొచ్చిన గ్లామర్ పంథా..:
నిజానికి కొత్తగా హీరోయిన్లు కూడా గ్లామర్ ఎక్స్‌పోజింగ్‌కు రెడీగా ఉన్నప్పటికీ.. కాజల్ లాంటి హీరోయిన్ కు ఇంకా అలాంటి అవకాశాలు వస్తున్నాయంటే.. ఆమె గ్లామర్ డిమాండ్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ రోల్స్‌కే పరిమితమైన కాజల్.. ఇప్పుడు కూడా తనకు అచ్చొచ్చిన పంథానే కొనసాగిస్తోంది.

ఎమ్మెల్యే.. మార్చి 23న:
కాగా, కల్యాణ్ రామ్-కాజల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఎమ్మెల్యే చిత్రం మార్చి 23న రిలీజ్ కానుంది. సినిమాకు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. భరత్ చౌదరి, ఎంవీ కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











