twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం కాజల్: కోర్టు చివాట్లు పెట్టింది

    కాజల్ కి మద్రాస్ కోర్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. వీవీడీ కొబ్బరినూనె తయారీ సంస్థపై కాజల్‌ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

    |

    కాజల్ కి కోర్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. వీవీడీ కొబ్బరినూనె తయారీ సంస్థపై కాజల్‌ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఆ కంపెనీకి అయిన కోర్టు ఖర్చంతా కూడా కాజల్ అండ్ కో పెట్టుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే..

    ఒక్క ఏడాదిపాటే

    ఒక్క ఏడాదిపాటే

    2008లో వీవీడీ కొబ్బరినూనె ప్రకటనలో నటించడానికి ఆ సంస్థతో కాజల్‌ ఎగ్రిమెంట్ చేసుకుంది. ఒక్క ఏడాదిపాటే ప్రసారంచేయాలనే నిబంధనతోనే ఆ ప్రకటనలో నటించానని, కానీ దాన్ని ఆ తర్వాతా ప్రసారంచేశారని ఆరోపిస్తూ ఆమె 2011లో మద్రాసు హైకోర్టులో కేసు వేసింది.

    Recommended Video

    Kajal Agarwal's Khoon Mein Hai Short Film
    నష్టపరిహారంగా రెండున్నర కోట్లు

    నష్టపరిహారంగా రెండున్నర కోట్లు

    ఒప్పందం ముగిసినప్పటికి తన ఫోటోను ఆ సంస్థ వాడుకుంటుందని అందుకు నష్టపరిహారంగా ఆ సంస్థ రెండున్నర కోట్లు చెల్లించాలంటూ ఆదేశం ఇవ్వాలని కాజల్ కోర్టుని కోరింది. దీనిపై తుది విచారణ జరిపిన జడ్జి జస్టిస్ టీ రవీంద్రన్ 60 సంవత్సరాల పాటు ఆ యాడ్ పై హక్కులు ఆ సంస్థకి ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో యాడ్ ని ఏడాది తర్వాత ప్రసారం చేయకూడదని కాజల్ డిమాండ్ చేయడం తప్పు అని అన్నారు. దీంతో కాజల్ కి కోర్టులో చుక్కెదురైంది.

    కోర్టుకు ఎక్కటానికి కారణం

    కోర్టుకు ఎక్కటానికి కారణం

    అసలు నిజానికి కాజల్ కోర్టుకు ఎక్కటానికి కారణం ఏంటంటే... కాజల్ ఆ యాడ్ చేశాక అమ్మడికి ఒక పెద్ద బ్రాండ్ కోకోనట్ ఆయిల్ యాడ్ వచ్చింది. ఈ కొత్త యాడ్ చేసుకోవాలంటే పాత యాడ్ తాలూకు వారి డీల్ ను క్యాన్సిల్ చేసుకోవాలి. అందుకని తెలివిగా వ్యవహరించి అమ్మడు ఇలా కోర్టుకు ఎక్కింది.

    హక్కులేదు

    హక్కులేదు

    అయితే కాపీరైట్స్‌ చట్టప్రకారం ఒక ప్రకటన దాన్ని రూపొందించిన సంస్థకే చెందుతుందన్నారు. అంతే కాకుండా 60ఏళ్ల వరకు వాణిజ్యప్రకటన ప్రమోషన్‌ హక్కులు వారికి ఉంటాయని చెబుతూ.. ఒక్క ఏడాదిలోనే ఆ ప్రకటనను ప్రసారం చేయాలని హక్కులేదని, ఒక వాణిజ్యప్రకటన ప్రమోషన్‌ హక్కులు ఆ సంస్థకు 60 ఏళ్ల వరకూ ఉంటాయని తీర్పు చెప్పారు.

    English summary
    Much to Kajal's shock, Court pronounced the verdict in favour of the VVD Coconut Oil Company. She was even asked to bear all the expenses incurred by the Company for Court expenses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X