ఊరుకోండి..నేను ఐటం సాంగ్ చేయటమేంటి?
హైదరాబాద్ :హీరోయిన్స్ ఐటం సాంగ్స్ చేయటం కొత్తేమీ కాదు. కాస్త టెమ్ట్ చేసే ఎమౌంట్ ఇస్తే...వారే వచ్చి చేస్తారు. ఏం ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్న తమన్నా..అల్లుడు శ్రీను లో చేయలేదా. అయితే కాజల్ మాత్రం నో అంటోంది. కాజల్ ఐటం సాంగ్ లో నర్తించనుందా? 'గీతాంజలి' కోసం ఐటెమ్ గాళ్‌గా కొత్త అవతారం ఎత్తనుందా? కొన్ని రోజులుగా మీడియాలో హాట్ హాట్‌గా వినిపిస్తోన్న సమాచారం ఇది.
అంజలి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'గీతాజంలి'. ఈ చిత్రంలో ఓ ఐటం సాంగ్ ఉంది. అందులో నర్తించడానికి కాజల్ ఒప్పుకొన్నట్టు ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకొంటున్నారు. ఈ విషయంపై వివరణ ఇచ్చింది కాజల్. ''నేను ప్రత్యేక గీతంలో కనిపిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. దయచేసి ఇలాంటి విషయాల్ని నమ్మొద్దు. ఒకవేళ ఆ అవకాశం ఉంటే నేనే చెబుతా'' అని ఫేస్‌బుక్‌లో వివరణ ఇచ్చింది. ప్రస్తుతం 'గోవిందుడు అందరివాడేలే' షూటింగ్‌లో బిజీగా ఉంది కాజల్. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కలయికలో రూపుదిద్దుకొనే సినిమాలోనూ కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గీతాంజలి'. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ నేపథ్య గళాన్ని అందిస్తున్నారు. రాజ్‌కిరణ్ దర్శకుడు. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్నారు.చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల రెండో వారంలో పాటల్ని విడుదల చేస్తారు. సోమవారం చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.

Post by Kajal Aggarwal.

కోన వెంకట్ మాట్లాడుతూ ''కథపై నమ్మకంతో నేనే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకొన్నా. ఆ సమయంలోనే ఎం.వి.వి.సత్యనారాయణ పరిచయమయ్యారు. దీంతో మేమిద్దరం కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. గీతాంజలి అనే యువతి జీవితం చుట్టూ సాగే కథ ఇది. ఆ అమ్మాయి ఎవరన్నదే ఆసక్తికరం. ఉత్కంఠ, వినోదం మేళవింపుతో రూపొందుతున్న చిత్రమిది. బ్రహ్మానందం పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయనపై ప్రత్యేకంగా ఓ పాట ఉంది. దాన్ని త్వరలోనే విడుదల చేస్తాం. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ పాత్రలు కథను మలుపు తిప్పుతాయి. వచ్చే నెల మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తామ''అన్నారు.
''అందరూ సొంత సినిమాలా భావించి పని చేశారు. అంజలి పాత్రతో పాటు సాయి శ్రీరామ్ కెమెరా పనితనం, ప్రవీణ్ లక్కరాజు సంగీతం చిత్రానికి బలాన్నిస్తాయి'' అన్నారు నిర్మాత. రావు రమేష్, అలీ, రఘుబాబు, ఝాన్సీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Click it and Unblock the Notifications