For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదేదో మా నాన్ననే అడగండి!..: ఆ విషయంపై తేల్చి చెప్పేసిన కాజల్

    |

    స్టార్ హీరో, హీరోయిన్లను ఆన్ స్క్రీన్‌పై చూడటం అభిమానులకు ఎంత ఇష్టమో.. వాళ్ల ఆఫ్ స్క్రీన్ విషయాలు తెలుసుకోవడంలోనూ అంతే ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రత్యేకించి.. వాళ్ల వ్యక్తిగత జీవితంలోని విషయాలంటే మరీ ఆసక్తి. లవ్, ఎఫైర్స్, పెళ్లి.. ఇలా ప్రతీది వాళ్లకు హాట్ టాపిక్కే.

    కాజల్ అగర్వాల్ MLA షూటింగ్ లీక్ డ్ ఫొటోస్...

    అందుకే అటు మీడియా సైతం సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెడుతుంది. ఏ చిన్న వార్త దొరికినా సరే.. అభిమానుల కోసం హాట్ హాట్ గాసిప్ వదులుతుంది. ఇప్పుడైతే హీరోయిన్ కాజల్ 'పెళ్లి' గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్..

    అనంతపురంలో కాజల్:

    అనంతపురంలో కాజల్:

    అనంతపురం పట్టణంలోని సుభాష్‌రోడ్డులో నూతనంగా ఏర్పాటైన ఓ డ్రెస్‌సర్కిల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాజల్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం తమిళంలో 'పారిస్‌ పారిస్'తో పాటు తెలుగులో కళ్యాణ్‌రామ్‌తో 'ఎమ్మెల్యే' సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు.

    పెళ్లి ప్రస్తావన:

    పెళ్లి ప్రస్తావన:


    కాజల్ తన సినిమాల గురించి మాట్లాడుతున్న సమయంలో.. కొంతమంది అభిమానులు పెళ్లి ఎప్పుడు? అంటూ ప్రశ్నించారు. దీనిపై సరదాగా బదులిచ్చిన కాజల్.. ఆ విషయం మా నాన్నను అడగాలంటూ తప్పించుకోవడం విశేషం. అంతేకాదు, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పింది.

    పెళ్లిళ్ల గోల:

    పెళ్లిళ్ల గోల:

    సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పెళ్లి గోల ఇప్పుడే కొత్తేమి కాదు. పలానా హీరోయిన్, పలానా వ్యక్తితో రహస్యంగా పెళ్లి చేసుకుందని, లేకపోతే వారిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని.. ఇక పెళ్లే తరువాయి అని రకరకాల పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి.

    సాయిధరమ్ తేజ్‌పై కూడా!:

    సాయిధరమ్ తేజ్‌పై కూడా!:


    ఇటీవలి కాలంలో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనాల ఎఫైర్ గురించి పెద్ద చర్చే జరిగింది. వీరిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని స్థితికి వెళ్లారని.., ఇక పెళ్లికి కూడా సిద్దపడిపోతున్నారని ప్రచారం జరిగింది.

    ఇదే విషయాన్ని సాయిధరమ్ ముందు ప్రస్తావిస్తే.. 'అవును నాకు పెళ్లయిపోయింది, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు' అని చురకలంటించారు.

    ప్రభాస్ పెళ్లి గోల:

    ప్రభాస్ పెళ్లి గోల:

    ఇక టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా చెప్పుకుంటున్న ప్రభాస్ పెళ్లి గురించి కూడా చాలాకాలంగా పెద్ద చర్చే జరుగుతోంది. ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ ఏదో వార్త తెర పైకి రావడం.. అదేమి లేదంటూ ఆయన పెద్దనాన్న కృష్ణం రాజు ఖండించడం జరుగుతూనే వస్తున్నాయి. నలభైకి చేరువవుతున్న ఈ హీరో పెళ్లితో పుకార్లకు ఎప్పుడు చెక్ పెడుతాడో చూడాలి మరి.

    English summary
    Kajal Agarwal responded on her marriage in an event in Anantapuram. While media questioned on her marriage, She answered go and ask my father about that,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X