నోరు జారి ఇరుక్కున్న కాజల్
దీంతో విషయం తెలుసుకుని షాక్ అయిన కాజల్ అగర్వాల్ తాను అలా అనలేదంటూ మాట మార్చేసింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ తను వేరే ఉద్దేశ్యంతో అనలేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చి కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. భారతీయ చిత్ర పరిశ్రమను ఒక కుటుంబంగా భావిస్తున్నానని, తమిళ సినిమా తనకు మంచి గౌరవాన్ని, ప్రేమను అందించిందని అంది. ప్రస్తుతం తమిళంలో మరో రెండు చిత్రాల్లో నటించనున్నట్లు కాజల్ అగర్వాల్ చెప్పింది.
ఈ విషయమై కాజల్ వివరణ ఇస్తూ తానిప్పుడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తున్నానన్నారు. తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనకు చాలా మంచి అనుభవం లభించిందని తెలిపారు. హీరోయిన్లకు తెలుగులోనే అధిక గౌరవమని తాను అన్నట్లుగా మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చాలా భాధ పడుతున్నానని చెప్పింది. నిజానికి తాను అలా అనలేదని చెప్పుకొచ్చింది. నటనకు భాష ముఖ్యం కాదని ప్లేట్ ఫిరాయించింది.
కాజల్ ఇటీవల హైదరాబాద్‌లో హిందీ చిత్రం 'స్పెషల్ చబ్బీస్' ప్రచార కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె - తమిళం కంటే తెలుగులోనే నటీమణికి విలువ ఎక్కువ అని చెప్పింది. ఈ అంశమ్మీద తమిళ సినీ జనాలు గుర్రుగా ఉన్నారు. విషయాన్ని గ్రహించిన కాజల్ వివరణ ఇస్తూ ''అన్ని భాషలూ నాకు ఒకటే. తెలుగు, తమిళ భాషలకు సమాన గౌరవం ఇస్తాను. త్వరలో రెండు తమిళ చిత్రాలు చేయబోతున్నాను'' అని చెప్పింది. అలాగే ''నటిగా చిత్రసీమలో ఎన్నో మంచి అనుభూతులున్నాయి. పలు భాషల్లో నటిస్తున్నాను. అయితే ఏది గొప్ప అని పోలికలు తీసుకురావడం అనవసరం. అయితే ఇందుకు సంబంధించి నేను చెప్పిన విషయాన్ని మరో అర్థంలో తీసుకొన్నారు కొందరు. నాకు తెలుగు, తమిళం సమానమే'' అంటూ చెప్పింది.


Click it and Unblock the Notifications












