తెలంగాణకు వ్యతిరేకమన్న టాప్ హీరోయిన్

By Bojja Kumar

ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ అంటే తెలంగాణ అంశమే. తెలంగాణ సెగలు ఆంధ్ర్రపదేశ్ లోని అన్ని వర్గాల ప్రజలకు తాకాయి. సినిమా రంగం కూడా ఇందుకు అతీతమేమీ కాదు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పలు సినిమాలు నష్టపోగా, అనేక పర్యాలు సినిమా షూటింగులపై దాడులు కూడా జరిగాయి. రాష్ట్రం సకల జనుల సమ్మెతో అట్టుడికి పోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని విడగొట్టాలా? వద్దా? అనే దానిపై అటు ఢిల్లీలో వాడీ వేడి చర్చలు సాగుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ అంశాన్ని టచ్ చేసింది టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.

సకల జనుల సమ్మె, తెలంగాణ ఉద్యమం ద్వారా సఫర్ అవుతున్న రాష్ట్ర ప్రజలకు...ట్విట్టర్ ద్వారా తన సింపతీ ప్రకటించింది. ఆమె వ్యాఖ్యల్లోని అర్థం సకల జనుల సమ్మెను, తెలంగాణ ఆందోళనలను కాజల్ వ్యతిరేకిస్తుందన్నమాట. సకల జనుల సమ్మెను, ఉద్యమాన్ని వ్యతిరేకించడం అంటే ఇండైరెక్టుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించడమే అంటున్నారు కొందరు తెలంగాణ వాదులు. మరి కాజల్ పాప ఈ గొడవలో ఎందుకు వేలు పెట్టిందో..? పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇది కూడా ఓ మార్గమని భావించిందో ఏమో..? తెలియదు గానీ దీని మూలంగా కాజల్ మున్ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనబోతోందో.. చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X