twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం కేథరిన్.. లక్ష్మీరాయే కాదు.. కాజల్ కూడా షాక్..

    సరైనోడు చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో అదరగొట్టి మెగా క్యాంపు దృష్టిలో పడింది. దాంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఖైదీ నంబర్ 150 చిత్రంలో అవకాశం తన్నుకుంటూ వచ్చింది. కానీ అంతలోనే చేజారింది. తా

    By Rajababu
    |

    Recommended Video

    పాపం కేథరిన్.. లక్ష్మీరాయే కాదు.. కాజల్ కూడా షాక్..

    అందం అభినయం రెండు ఉన్నా సినిమా పరిశ్రమలో అదృష్ణం కలిసి రావాలంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే అందాల భామ కేథరిన్ త్రెసా ఎదురువుతున్నది. సరైనోడు చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో అదరగొట్టి మెగా క్యాంపు దృష్టిలో పడింది. దాంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఖైదీ నంబర్ 150 చిత్రంలో అవకాశం తన్నుకుంటూ వచ్చింది. కానీ అంతలోనే చేజారింది. తాజాగా అలాంటి చేదు అనుభవమే మళ్లీ రవితేజ్ సినిమాలో ఎదురైంది. అసలేం జరిగిందంటే..

    మెగాస్టార్‌తో ఛాన్స్ అలా..

    మెగాస్టార్‌తో ఛాన్స్ అలా..

    గ్లామర్‌తో దడదడలాండించే కేథరిన్‌ను మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం. 150 చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం కేథరిన్‌కి దక్కింది. దాంతో కేథరిన్ మరో రేంజ్ వెళ్తుందని అందరూ ఆశించారు. అయితే ఊహించని విధంగా కేథరిన్‌ తప్పించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కేథరిన్ స్థానంలో లక్ష్మీరాయ్‌ను తీసుకోవడం జరగడం.. ఆమె చేసిన ఐటెం పాటకు మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే.

    ప్రభుదేవా చిత్రం నుంచి అవుట్

    ప్రభుదేవా చిత్రం నుంచి అవుట్

    ఆ తర్వాత తమిళంలో కూడా కేథరిన్ అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రభుదేవా హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం కోసం కేథరిన్‌ను ముందుగా అనుకొన్నారు. అంతా సవ్యంగా జరుగుతుండగానే సడెన్‌గా లక్ష్మీరాయ్ తెరపైకి వచ్చింది. దాంతో కేథరిన్ ప్రభుదేవా సరసన నటించే అవకాశాన్ని కోల్పోయింది. రెండుసార్లు లక్ష్మీరాయ్‌ చేతిలో దెబ్బతిన్న కేథరిన్‌కు తాజాగా మరో షాక్ తగిలింది.

    రవితేజ చిత్రంలో కేథరిన్!

    రవితేజ చిత్రంలో కేథరిన్!

    తమిళంలో భోగన్ చిత్రం ఇటీవల అనూహ్య విజయం సాధించింది. ఆ చిత్రంలో నటించిన జయం రవి, హన్సిక తదితరులకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ చిత్రం. ప్రస్తుతం ఆ చిత్రాన్ని రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ తెలుగులో వెర్షన్‌ కూడా డైరెక్షన్ చేస్తుండటం గమనార్హం.

    ప్రభుదేవా చిత్రం నుంచి అవుట్

    ప్రభుదేవా చిత్రం నుంచి అవుట్

    భోగన్ తెలుగు రీమేక్లో ‌ హీరోయిన్‌గా కేథరిన్‌ను అనుకొన్నారు. అయితే ఏమైందో ఏమో గానీ కేథరిన్ తప్పించి ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్‌ను తీసుకోవాలనుకొంటున్నారట. దర్శకుడు, హీరో చాయిస్ మేరకు కాజల్‌ను నిర్మాతలు సంప్రదించినట్టు తెలుస్తున్నది. అయితే కాజల్‌ ఎంపిక ఖారారుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కేథరిన్ అదృష్టం ఏమేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

    English summary
    Tamil super hit movie Bhogan is remaking in Telugu. Ravi Teja is the hero in this movie. First Catherine Tresa roped as heroine in this film. But report suggest that Kajal Agarwal to replace in place of Catherine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X