Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పాపం కేథరిన్.. లక్ష్మీరాయే కాదు.. కాజల్ కూడా షాక్..
సరైనోడు చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో అదరగొట్టి మెగా క్యాంపు దృష్టిలో పడింది. దాంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఖైదీ నంబర్ 150 చిత్రంలో అవకాశం తన్నుకుంటూ వచ్చింది. కానీ అంతలోనే చేజారింది. తా
Recommended Video
అందం అభినయం రెండు ఉన్నా సినిమా పరిశ్రమలో అదృష్ణం కలిసి రావాలంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే అందాల భామ కేథరిన్ త్రెసా ఎదురువుతున్నది. సరైనోడు చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో అదరగొట్టి మెగా క్యాంపు దృష్టిలో పడింది. దాంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఖైదీ నంబర్ 150 చిత్రంలో అవకాశం తన్నుకుంటూ వచ్చింది. కానీ అంతలోనే చేజారింది. తాజాగా అలాంటి చేదు అనుభవమే మళ్లీ రవితేజ్ సినిమాలో ఎదురైంది. అసలేం జరిగిందంటే..
మెగాస్టార్‌తో ఛాన్స్ అలా..
గ్లామర్‌తో దడదడలాండించే కేథరిన్‌ను మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం. 150 చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం కేథరిన్‌కి దక్కింది. దాంతో కేథరిన్ మరో రేంజ్ వెళ్తుందని అందరూ ఆశించారు. అయితే ఊహించని విధంగా కేథరిన్ తప్పించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కేథరిన్ స్థానంలో లక్ష్మీరాయ్‌ను తీసుకోవడం జరగడం.. ఆమె చేసిన ఐటెం పాటకు మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే.
ప్రభుదేవా చిత్రం నుంచి అవుట్
ఆ తర్వాత తమిళంలో కూడా కేథరిన్ అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రభుదేవా హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం కోసం కేథరిన్‌ను ముందుగా అనుకొన్నారు. అంతా సవ్యంగా జరుగుతుండగానే సడెన్‌గా లక్ష్మీరాయ్ తెరపైకి వచ్చింది. దాంతో కేథరిన్ ప్రభుదేవా సరసన నటించే అవకాశాన్ని కోల్పోయింది. రెండుసార్లు లక్ష్మీరాయ్ చేతిలో దెబ్బతిన్న కేథరిన్‌కు తాజాగా మరో షాక్ తగిలింది.
రవితేజ చిత్రంలో కేథరిన్!
తమిళంలో భోగన్ చిత్రం ఇటీవల అనూహ్య విజయం సాధించింది. ఆ చిత్రంలో నటించిన జయం రవి, హన్సిక తదితరులకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ చిత్రం. ప్రస్తుతం ఆ చిత్రాన్ని రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ తెలుగులో వెర్షన్ కూడా డైరెక్షన్ చేస్తుండటం గమనార్హం.
ప్రభుదేవా చిత్రం నుంచి అవుట్
భోగన్ తెలుగు రీమేక్‌లో హీరోయిన్గా కేథరిన్‌ను అనుకొన్నారు. అయితే ఏమైందో ఏమో గానీ కేథరిన్ తప్పించి ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్‌ను తీసుకోవాలనుకొంటున్నారట. దర్శకుడు, హీరో చాయిస్ మేరకు కాజల్‌ను నిర్మాతలు సంప్రదించినట్టు తెలుస్తున్నది. అయితే కాజల్ ఎంపిక ఖారారుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కేథరిన్ అదృష్టం ఏమేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.