కాజల్ నోటీ దూళ ఇంకా తీరినట్టు లేదు...?!
జీవితంలో పెద్ద పొజిషన్ కి వెళ్లే కొద్దీ ఏం మాట్లాడినా కాస్త ఆచితూచి మాట్లాడాలంటారు. మాటల్లో ఏమాత్రం తేడా వచ్చినా అందరూ ఉతికి ఆరేసేస్తారు. ఈమధ్య పెద్ద కళ్ళ కాజల్ పరిస్థితి కూడా అలాగే ఉంటోంది. 'నేను మీ అమ్మాయినే' అంటూ కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో స్టేట్ మెంట్ ఇచ్చి దుమారం లేపిన కాజల్, ఇటీవలే ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కి టాప్ లెస్ పోజులిచ్చి, తర్వాత 'అవి నేను ఇవ్వలేదు... మార్ఫింగ్ మాయాజాలం' అంటూ సదరు పత్రిక మీదే నింద మోపి, తీరా ఆ పత్రిక వాళ్లు ప్రూఫ్ చూపిస్తామనగానే నోటికి తాళం వేసేసింది.
ఈ భామ ఇప్పుడు మళ్లీ దక్షిణాది ప్రేక్షకుల మీద నోరు పారేసుకుంది. 'దక్షిణాది ప్రేక్షకులకు ట్రెండ్స్ ఏమీ తెలియవు. వాళ్లంతా అదో టైపు" అంటూ తాజాగా ఓ చానెల్ ఇంటర్వ్యులో సెలవిచ్చి, మరో వివాదాన్ని రేపింది. దీంతో ఇప్పుడు సౌత్ దర్శక నిర్మాతలు కాజల్ మీద పీకల దాకా కోపంగా వున్నారు. అది గ్రహించిన కాజల్" సౌత్ వాళ్లని కించపరచాలన్నది నా ఉద్దేశం కాదు. 'గ్లామర్ కి వాళ్ళంత ప్రాధాన్యత ఇవ్వరు. మోతాదులో ఉంటేనే చూస్తారు... 'అన్నాను. అంతకు మించి నేనేమీ కామెంట్ చేయలేదు" అంటూ సర్దిచేప్పే ప్రయత్నం చేస్తోంది.
అయితే, ఆమె మాటల్ని నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. మన సినిమాలతో ఎదిగి ఇంత స్టార్ అయిన కాజల్ కి, సరైన గుణపాఠం చెప్పడానికి సౌత్ ఫిలిం మేకర్స్ రెడీగా వున్నట్టు తెలుస్తోంది.!


Click it and Unblock the Notifications











