వెంకీ‌ పక్కన చేయటానికి నో చెప్పారా?? ఇంత నిర్మొహమాటమా..!?

వెంకీ హీరోగా తేజా దర్శకత్వం వహిస్తున్న హీరోయిన్స్ ని ఇద్దరిని అనుకున్నా వారు రిజెక్ట్ చేశారట. వారు ఎవరో కాదు ఒకరు కాజల్ అగర్వాల్ మరొకరు మిల్కి బ్యూటీ తమన్నా.

Recommended Video

Top Heroins Said No To Act With Venkatesh వెంకీ‌ కి నో చెప్పారా

గత కొద్ది రోజులుగా ఇంతకు ముందు ఎప్పుడూ లేని సమస్య వచ్చి పడింది. అదే తెలుగు హీరోలకి హీరోయిన్ల కొరత. చిరంజీవీ, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సినిమా మొదలైన ప్రతీసారి ఇదే సమస్య ఎదురవుతోంది.వీరి సరసన ఇప్పటికి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకునే స్థాయిలో ఉన్నది అయితే అనుష్క, లేదా నయన తార.

వెనకడుగు వేస్తున్నారు

వెనకడుగు వేస్తున్నారు

మిగతా హీరోయిన్లంతా ఈ అగ్ర హీరోల పక్కన చేయటానికి వెనకడుగు వేస్తున్నారు. వీళ్ళ భయమంతా ఇలా పెద్దనటుల పక్కన చేస్తే మళ్ళీ కుర్ర హీరోల పక్కన చాన్స్ రాదేమో అని. అయితే ఇదే సమస్య నయన్ కి గానీ అనుష్కకి గానీ లేదు వీళ్ళు పెద్దా చిన్న అనికాకుండా ఎవరి పక్కనైనా ఇట్టే సూటైపోతారు.

 కాజల్, లాంటి హీరోయిన్లు

కాజల్, లాంటి హీరోయిన్లు

ఈ మధ్య ఉన్న ఇంకో సమస్య ఏమిటంటే కాజల్ లాంటి హీరోయిన్లు కూడా ఎక్కువగా అయితే కోలీవుడ్, లేదంటే బాలీవుడ్ అంటూ ఎప్పుదూ అటుకూడా ఒక కన్నేసి ఉంచుతున్నారు. అందుకే ఆనాటి ఏఎన్నార్, ఎన్టీఆర్ల కాలం లో కూడా రాని సమస్య ఇప్పుడు వచ్చింది.

నేనే రాజు నేనే మంత్రి

నేనే రాజు నేనే మంత్రి

ఒక కథరాసుకునేటప్పుడే ఎవరైతే బావుంటారన్న ఒక ఐడియాతో అన్నీ సిద్దం చేసుకున్నాక సరిగ్గా వాళ్ళు ఉంటేనే కథకి న్యాయం జరుగుతుంది. పక్కాగా అలా పాత్రలని డిజైన్ చేసుకున్నాకే "నేనే రాజు నేనే మంత్రి" లాంటి సినిమా తో హిట్ కొట్టాడు తేజా. ఒకరకంగా ఆ సినిమా తేజా కి డైరెక్టర్ గా కమ్ బ్యాక్ సినిమా అయ్యింది.

 కెరీర్ గాడిలో పడ్డట్టే

కెరీర్ గాడిలో పడ్డట్టే

ఇక ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో తీయబోతున్న సినిమాతో ఇంకో హిట్ పడితే ఇక మళ్ళీ కెరీర్ గాడిలో పడ్డట్టే అనుకుంటున్నాడు తేజా అందుకే వెంకీ సినిమా కోసం బాగా కష్తపడుతున్నాడు. అయితే ప్రస్తుతం వెంకటేష్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.

 సినిమా వదులుకున్నారట

సినిమా వదులుకున్నారట

కానీ పాత్రల ఎంపిక విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్స్ ని ఇద్దరిని అనుకున్నా వారు రిజెక్ట్ చేశారట. వారు ఎవరో కాదు ఒకరు కాజల్ అగర్వాల్ మరొకరు మిల్కి బ్యూటీ తమన్నా. వీరిద్దరూ ప్రస్తుతం పెద్దగా బిజీగా ఏమీ లేరు. కాని కాజల్ మాత్రం.. కాస్త రెమ్యునరేషన్ భారీగా అడిగేసి.. అలాగే తమన్నా అయితే డేట్స్ లేవు అంటే బిల్డప్ ఇచ్చేసి సినిమా వదులుకున్నారట.

 యంగ్ హీరోలు పట్టించుకోరేమో

యంగ్ హీరోలు పట్టించుకోరేమో

అయితే వెంకటేష్ పక్కన హీరోయిన్ అంటే.. ఇక యంగ్ హీరోలు పట్టించుకోరేమో అని అనుకుని ఈ ఛాన్సు వదులుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ సెట్ అయ్యే హీరోయిన్ ని ఇప్పుడు ఎక్కడ నుండి తీసుకోవాలని తేజ చాలా ఆలోచిస్తున్నాడట. అది సంగతి. ఎప్పటికి ఈ సమస్య తీరేనో గానీ ఎక్కువమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజా ఇప్పుడు అనుకున్న పాత్రకి సరిపోయే హీరోయిన్ దొరకక చాలానే ఇబ్బంది పడుతున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X