ఛార్మి ప్లేస్ లోకి కాజోల్..

By Staff

Kajal Agarwal
కలిసొచ్చేకాలమొస్తే అనుకోని అదృష్టాలన్నీ అలవోకగా వస్తాయి. వేరే వాళ్ళ ఆఫర్లు కూడా అడగకుండానే అక్కున చేరుతాయి. లక్ష్మీ కళ్యాణం తో కెరీర్ ప్రారంభించి చందమామతో లక్కీ గర్ల్ గా మారిన ముంబాయి ముద్దుగుమ్మ కాజోల్ కి ఇప్పుడు ఆ దశ నడుస్తోంది. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారింది. దాంతో కామన్ గానే బయిట యాడ్ ఫిలింస్ లో ఆమెకి మోడల్ గా చేయమంటూ ఆఫర్లు రావటం ...ఎక్కడ చూసినా వాటి హోర్డింగ్ లు దర్శనమివ్వటం యధావిధిగా జరిగిపోయాయి. తాజాగా ఆమెకు హైదరాబాద్‌లోని పేరుపొందిన మొబైల్ ఔట్‌లెట్ 'బిగ్ సి'కి బ్రాండ్ అంబాసడర్‌గా చేసే ఛాన్స్ వచ్చింది.

ఇప్పటికే ఆ సంస్థకు ఛార్మి బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తోంది. ఆమెతో కాంట్రాక్ట్ ముగుస్తుండటంతో దాన్ని పొడిగించాలని ఆ సంస్థ అనుకోవడం లేదు. అందుకే ఆమె బదులు యూత్‌లో ఇప్పుడు మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కాజల్ వైపు వారు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఛార్మి ఆలోచనలో పడుతోందిట. మెల్లిమెల్లిగా తన హవా తగ్గుతోందని గమనిస్తోందిట. ప్రస్తుతం కాజోల్ ఖజానా జ్యూయెలర్స్‌కు బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తోంది. రాంచరణ్ సరసన యస్‌యస్ రాజమౌళి రూపొందిస్తున్న సినిమాలోనూ, వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న 'సెవెన్'లోనూ నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X