»   » కాజల్ న్యూడ్ ఫోటో వెనక షాకిచ్చే నిజం

కాజల్ న్యూడ్ ఫోటో వెనక షాకిచ్చే నిజం

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెండు రోజుల క్రితం ఎఫ్ హెచ్ ఎం ఆంగ్ల పత్రిక కవర్ పేజిపై కాజల్ అగర్వాల్ టాప్ లెస్ ఫోజ్ వచ్చి సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాను అలా ఫోజ్ లు ఇవ్వలేదని,అదంతా మార్పింగ్ వ్యవహారమని తేల్చేసింది.తను ఎలా అర్ధనగ్నంగా పోజులిచ్చి ఫోటో దిగుతారనుకున్నానని ఎదురు ప్రశ్నిస్తోంది.అదంటా చీప్ పబ్లిసిటీ కోసం ఎల్లో జర్నలిజానికి పరాకాష్ట అని తిడుతోంది.అయితే తాను 'సింగమ్‌'విడుదలయ్యాక తాను ఆ పత్రికకు ఫోజులిచ్చి ఫొటో షూట్ లో పాల్గొన్న మాట వాస్తవమేనని,అయితే తాను దిగిన ఫొటోలను ఇలా మార్పింగ్ చేస్తారని ఊహించలేనని చెప్తోంది. ఇక ఆమె సోదరి నిషా అగర్వాల్ మాట్లాడుతూ..ఆ ఫోటో వలన తన అక్క ఇమేజ్ చాలా పోయిందని, ఎందరో తమకు ఫోన్ లు చేస్తున్నారని, తమ కుటుంబం మొత్తం అప్ సెట్ అయ్యారని అంది.

ఆ పత్రికమీద కేసులు వేసే ఆలోచనలో ఉన్నామని, అలాగే ఆ పోటో లు ఉన్న పుస్తకాలు మార్కెట్లోంచి తీయించేలా చర్యలు తీసుకునేందుకు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నామని ఆమె అంది.ఇక దక్షిణాదిన ఇలాంటి విషయాలకు కాస్త దూరంగా ఉండే కాజల్‌ ఇలా కనిపించేందుకు ఎందుకు ఒప్పుకొందో అని సినీ పరిశ్రమలోని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. బాలీవుడ్‌ దర్శకుల దృష్టిలోపడేందుకే ఈ ఫోటోలు హంగామా అంటున్నారు. ఈ హాట్‌ చిత్రా లు కాజల్‌కి గ్యారెంటీగా హిందీలో అవకాశాలు తీసుకొస్తాయని భావిస్తోందని మాట్లాడుకుంటున్నారు. అజయ్‌దేవగణ్‌ నటించిన 'సింగమ్‌'లో చేసిన కాజల్‌ కి ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో అవసరమైతే గ్లామర్‌ ఒలికించడానికి తాను సిద్ధమని ఇలా సంకేతాలు పంపిస్తోందని చెప్పుకున్నారు.ప్రస్తుతం ఆమె తెలుగులో మహేష్ సరసన ది బిజినెస్ మ్యాన్ చిత్రంలో చేస్తోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ప్రారంభమైన ఆ చిత్రం పై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది.

English summary
Actress Kajal Agarwal has a good reason to be fuming and fretting the way she is. FHM, a Mumbai-based men’s magazine has morphed her picture as a topless girl to gain some “cheap publicity” by stooping to the lowest practices of yellow journalism.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu