ఆ సర్వేలో కాజల్ టాప్
ఇంటర్నేషనల్ వెబ్ సైట్స్ నిర్వహించిన ఓ సర్వేలో కాజల్ అగర్వాల్ టాప్ గా నిలిచింది. మ్యాగజైన్ కవర్స్ లో బాగా గ్లామరస్ గా కనపడ్డ ఫిగర్ ఎవరని ఆ కంటెస్ట్ లో ప్రశ్న. దానికి ఎక్కువగా కాజల్ కి ఓట్లు పడ్డాయి. ఆ ఫోటో ఎఫ్ హెచ్ ఎమ్ కవర్ కవర్ మీద కాజల్ కనపడ్డ స్పైసీ స్టిల్ అది. అప్పట్లో ఆ కవర్ పేజీ మీద పెద్ద వివాదమే చెలరేగింది. తాను స్టిల్ ఇవ్వలేదని అది ఫేక్ అని కాజల్ వాదించింది. దానికి ఆ మ్యాగజైన్ వారు తమ దగ్గర షూటింగ్ చేసిన ఆధారాలు ఉన్నాయని కొట్టి పారేసారు. ఇక ఆమె ప్రస్తుతం మహేష్‌తో కలిసి 'బిజినెస్ మేన్'లో నటిస్తోంది.పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది.ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఇక కాజల్ తెలుగులో రామ్ చరణ్,వి వి వినాయిక్ ల కాంబినేషన్ లో రూపొందే చిత్రం కూడా కమిటైంది.జనవరి నుంచి ఆ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.ఆగస్టులో రిలీజవుతుంది.సమంత దూసుకుపోవటంతో కాస్త కాజల్ దూకుడు తగ్గింది.


Click it and Unblock the Notifications











