బృందావనం హిట్ తో మంచి జోష్ మీద ఉన్న కాజల్..!
అందంతో పాటు అభినయం కూడా తోడైతేనే నటిగా ముందుకు దూసుకుపోగలం. ఈ విషయాన్ని నేను బాగా వంటబట్టించుకున్నాను. అందుకే సక్సెస్ దానంతటదే నడుచుకుంటూ నా దగ్గరకొచ్చింది" అని ధీమాగా చెబుతున్నారు లేడికళ్ల కాజల్. 'బృందావనం" విజయంతో మంచి జోష్ మీదున్న ఈ అందాల తార కాజల్ మాట్లాడుతూ'ఈ మధ్య అందరూ 'నంబర్ వన్ హీరోయిన్" అని నా గురించి మాట్లాడుకుంటుంటే కాస్తంత గర్వంగా అనిపించింది.
కానీ అది తలకెక్కకుండా వెంటనే జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే ఒక్క ఫ్లాప్ తో ఆ నంబర్ వన్ అనే పోస్ట్ చేజారిపోతుందన్న విషయం నాకు బాగా తెలుసు. అశాశ్వతమైన ఈ పొజిషన్లపై నాకు ఏ మాత్రం మక్కువ లేదు. నటిగా ప్రేక్షకుల హృదయాల్లో కొంత కాలమైనా స్థానం సంపాదించగలిగితే చాలు" అని తన మనసును ఆవిష్కరించారు. కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానున్న మీ సోదరికి సూచనలేమైనా ఇస్తుంటారా...? అని అడిగితే..
'ఇక్కడ ఎవ్వరూ ఎవరికీ నేర్పరు.అనుభవాలే అన్నీ నేర్పిస్తాయి. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట. కాకపోతే... నిషాకు నేను ఒక్క విషయం మాత్రం చెప్పా. ఏ సినిమాలో అయినా హిట్ కోసమే నటిస్తాం. ఒక్కోసారి అంచనాలు తారుమారు అవుతుంటాయి. అలాంటి సమయంలో డీలా పడకుండా వుంటే కెరీర్ లో మరింత ఎత్తులు చూడగలుగుతాం అని మాత్రం చెప్పా. నిషాకు నాకంటే సహనం ఎక్కువ. తప్పకుండా నెగ్గుకు రాగలదని నా అభిప్రాయం" అని సమాధానమిచ్చారు కాజల్.


Click it and Unblock the Notifications











