Don't Miss!
- News ఏకగ్రీవంగా సికింద్రాబాద్.. మోడీ-అమిత్ షా గేమ్ ప్లాన్?
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నా దినచర్య అదే.. పొద్దు పొద్దున్నే ఆ పని.. భర్తతో కాజల్ రచ్చ!!
కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూలు సోషల్ మీడియాను ఊపేశారు. పెళ్లి ఫోటోలే ఓ రేంజ్లో వైరల్ అయ్యాయంటే.. హనీమూన్ ఫోటోలు అంతకు మించి అనేలా ట్రెండ్ అయ్యాయి. మాల్దీవుల్లో ఈ ఇద్దరి హనీమూన్ విశేషాలు సోషల్ మీడియాను ఊపేశాయి. సముద్రం లోపల కూడా ఈ ఇద్దరి రొమాన్స్, అంత గ్రాండ్‌గా హనీమూన్ చేసుకోవడంపైనా నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఆ మధ్య కాజల్ హనీమూన్ మీద సపరేట్గా ట్రోలింగ్ కూడా నడిచింది.
పెళ్లి వేడుకలు వైరల్..
కాజల్ పెళ్లి అక్టోబర్ 30న జరిగింది. కానీ వాటికి సంబంధించిన వార్తలు, విశేషాలు మాత్రం ఆ వారం రోజులు వైరల్ కాసాగాయి. నేషనల్ మీడియా సైతం కాజల్ పెళ్లి విశేషాలను లైవ్‌లో అందించాయి. వారం రోజుల పాటు కాజల్ గౌతమ్ వార్తలే వైరల్ అయ్యాయి.
మాల్దీవుల్లో హనీమూన్..
మన తారలందరూ కూడా అన్ లాక్ ప్రక్రియ తరువాత మాల్దీవులకే పయణమయ్యారు. అందులో భాగంగా కాజల్ గౌతమ్ కూడా తమ హనీమూన్‌ను సెలెబ్రేట్ చేసుకునేందుకు మాల్దీవులకే వెళ్లారు. అక్కడ ఈ కొత్త జంట చేసిన రచ్చకు సోషల్ మీడియా షేక్ అయింది.
తాజాగా ఇలా..
మొత్తానికి కాజల్ గౌతమ్ కొత్త వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టేశారు. కాజల్ తన బ్రాండ్ వ్యాల్యూతో కొత్త బిజినెస్ విస్తరించేలా ఉంది. ఇక తాజాగా కాజల్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. ఎవరు ఎలాంటి ప్రశ్నలైనా అడగండి.. సమాధానాలు చెబుతాను అని కాజల్ చెప్పింది.
రకరకాల ప్రశ్నలు..
అలా కాజల్ చాన్స్ ఇవ్వడంతో ఒక్కొక్కరు రకరకాల ప్రశ్నలు సంధించారు. సినిమాలు వదిలేస్తావా? నీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు? గౌతమ్ కిచ్లూ గురించి చెప్పు? నీ ఫోన్లోని వాల్ పేపర్ ఏంటి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలను సంధించారు. మార్నింగ్ లేవవగానే చేసే పనులేంటని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కాజల్ క్రేజీ సమాధానం ఇచ్చింది.
హగ్ మాత్రం కంపల్సరీ..
నా ఉదయాన్ని గ్రాటిట్యూడ్తోనే ప్రారంభిస్తాను.. పసుపు అల్లంతో కూడని యాపిల్ సీడ్ వెనిగర్, వేడి నీళ్లు తాగుతాను. మహమంత్రాలను జపిస్తాను.. ట్రేడ్ మీల్ మీద 30నిమిషాలు వర్కవుట్ చేస్తాను.. ఇక కచ్చితంగా నా భర్తకు మాత్రం హగ్ ఇస్తాను అంటూ కొంటె కామెంట్ చేసింది.