సోనూ సూద్‌కు అరుదైన గౌరవం.. గర్వించే ఫ్రెండ్ అంటూ కాజల్ పోస్ట్
ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగానూ సోనూ సూద్ ఖ్యాతి గురించి అందరికీ తెలిసిందే. కరోనా కష్టకాలాన్ని, లాక్డౌన్‌లో సోనూ సూద్ చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సోనూ సూద్ చేసిన సేవలకు అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. తాజాగా ఆయన్ను స్పైస్ జెట్ విమానయాన సంస్థ అరుదైన గౌరవాన్ని కల్పించింది. ప్రస్తుతం సోను సూద్ పేరు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

అరుదైన గౌరవం..
సోనుసూద్‌కు దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ అరుదైన గౌరవం అందించింది. లాక్‌డౌన్ సమయంలో ఆయన చేసిన విశేషమైన సేవలకు గౌరవంగా స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ ఫొటో వేశారు. 'ఆపద్బాంధవుడు సోనూసూద్‌కు సెల్యూట్' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.

చేతనైన సాయం..
దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి. స్పైస్‌జెట్ నుంచి లభించిన ఈ గౌరవం పట్ల సోనూ ఆనందం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నవారికి తాను చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానని తెలిపారు.

కాజల్ ఆనందం..
సోనూ సూద్‌కు దక్కిన గౌరవం పట్ల నటి కాజల్ ఆనందం వ్యక్తం చేసింది. కష్టకాలంలో ఎంతో గొప్ప మనవత్వాన్ని చాటావ్.. ఎన్నో సేవలు చేశావ్.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది ఫ్రెండ్ అంటూ అంటూ కాజల్ ట్వీట్ వేసింది. ఈ ట్వీట్ సోనూ సూద్ స్పందిస్తూ.. థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. చివరగా సీత సినిమాల్లో ఇద్దరూ పోటాపోటీగా నటించారు.

సూపర్ హీరో..
లాక్డౌన్ సమయంలో సోనూ సూద్ సూపర్ హీరో అవతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే. ఎవరు ఎక్కడ సాయం కావాలన్నా, తన అవసరం ఎక్కడ ఉందని తెలిసినా చేయి అందించాడు. ఎంతో మందిని స్వగ్రామాలకు చేర్చాడు. ఆపరేషన్స్ చేయించాడు. విద్య, ఉద్యోగాలకు సాయం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సోనూ సూద్ చేసిన కార్యక్రమాలకు అంతే ఉండదు.


Click it and Unblock the Notifications











