'సీత' ప్రీరిలీజ్ బిజినెస్.. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ సినిమాకి ఇంత క్రేజా!

Recommended Video

Kajal Aggarwal And Bellamkonda Srinivas's Sita Movie Pre Release Business || Filmibeat Telugu

కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం సీత. తేజ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నేనే రాజు నేనే మంత్రి చిత్రం తరువాత తేజ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో కథ మొత్తం కాజల్ అగర్వాల్ పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం. గత ఏడాది కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ కవచం చిత్రంలో జంటగా నటించారు. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి మంచి కమర్షియల్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా సీత చిత్ర థియేట్రికల్ హక్కులు ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

నెగిటివ్ రోల్

నెగిటివ్ రోల్

దర్శకుడు తేజ చాలా కాలం తర్వాత నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తిరిగి పుంజుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా తేజ ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తేజ ఆసక్తిక్రమైన కథని సిద్ధం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాజల్ అగర్వాల్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్నట్లు టీజర్ ద్వారా అర్థం అయింది.

ప్రీరిలీజ్ బిజినెస్

ప్రీరిలీజ్ బిజినెస్

సీత చిత్ర థియేట్రికల్ హక్కులకు మంచి ధర లభించినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సీత చిత్రాన్ని బయ్యలు 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఈ చిత్రానికి ఇంత క్రేజ్ నెలకొని ఉందా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తేజ దర్శత్వం, కాజల్ అగర్వాల్ పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ ఉండడం, టీజర్ లాంటి అంశాలు ప్రీరిలీజ్ బిజినెస్ కు కలసి వచ్చాయి.

నిరాశపరిచిన కవచం

నిరాశపరిచిన కవచం

ఇదిలా ఉండగా కవచం చిత్రంలో కూడా బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగానటించారు . ఆ చిత్రానికి 18 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ చిత్రం కేవలం 5 కోట్ల వరకు మాత్రమే రాబట్టింది. ఈ నేపథ్యంలో సీత చిత్రం 13 కోట్లు రాబట్టాలంటే మంచి విజయం సాధించాలి. ఏప్రిల్ 25న సీత చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

పాయల్ రాజ్‌పుత్ ఐటెం సాంగ్

పాయల్ రాజ్‌పుత్ ఐటెం సాంగ్

సీత చిత్రంలో మాస్ ప్రేక్షకులని ఆకర్షిస్తున్న మరో అంశం పాయల్ ఐటెం సాంగ్. ఈ ఐటెం సాంగ్ లో పాయల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. ఆర్ఎక్స్ 100 చిత్రంతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన పాయల్ ప్రస్తుతం పలు అవకాశాలు అందుకుంటోంది. సోనూసూద్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X