»   » ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్: ఎక్స్ ఫోజింగుతో షాకిచ్చిన కాజల్ (వీడియో)

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్: ఎక్స్ ఫోజింగుతో షాకిచ్చిన కాజల్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ నుండి పలువురు సినీ ప్రముఖులు హాజరు కాగా ఈ కార్యక్రమం చాలా కన్నుల పండుగగా జరిగింది. పలువురు హీరోయిన్లు ప్రత్యేకమైన వస్త్రధారణతో హాట్ అండ్ సెక్సీ లుక్ తో ఆకట్టుకున్నారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ కాజల్ మాత్రం అందరి కంటే హాట్ గా ఎక్స్ ఫోజింగ్ చేసి షాకిచ్చింది.

కాజల్ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఈ రేంజిలో ఎక్స్ ఫోజింగ్ చేయలేదు. అలాంటిది ఓ అవార్డుల కార్యక్రమంలో అమ్మడు ఈ రేంజిలో హాట్ గా కనిపించే సరికి అంతా ఆశ్చర్య పోతున్నారు. సౌత్ సినిమాల్లో కాజల్ స్టార్ హీరోయిన్. అయితే బాలీవుడ్లో మాత్రం అమ్మడు అనుకున్న స్థాయికి ఎదగలేక పోతోంది. హిందీలో ఒకటి రెండు సినిమాలు చేసినా ఆ సినిమాలు సరిగా ఆడక పోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.

Kajal Aggarwal at Filmfare Awards 2016

బాలీవుడ్ లాంటి చోట గుర్తింపు ఉంటేనే అవకాశాలు వస్తాయి. ఇందుకోసం పలువురు హీరోయిన్ల మేగజైన్ల పై హాట్ హాట్ ఫోజులతో రెచ్చి పోతుంటారు. కాజల్ కూడా ఇలాంటివి చేసింది. అయితే మరింత స్పెషల్ గా నిలవడానికి, తన గురించి, తన అందం గురించి మీడియాలో హాట్ టాపిక్ కావాలనే ఉద్దేశ్యంతోనే ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఈ రేంజిలోరెచ్చిపోయిందని అంటున్నారు.

ప్రస్తుతం కాజల్ హిందీలో ‘దో లబ్జోంకి కహాని' అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక తెలుగులో టాప్ హీరోలైన మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవ', పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలు చేస్తోంది. దీంతో పాటు తమిళంలో ‘కవలై వేండమ్' అనే సినిమా చేస్తోంది.

English summary
Kajal Agarwal Very HOT Exposing Mind Blowing Cleavage Show at Film Fare Awards 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu