సముద్ర తీరంలో ఎంజాయ్ చేసిన కాజల్ (ఫోటోలు)
ముంబై: వరుస సౌత్ సినిమాలతో బిజీ బిజీగా గడిపిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ బిజీలైఫ్ నుంచి సేద తీరేందుకు విహార యాత్రకు వెళ్లింది. ఇటీవల ఆమె నటించిన బాలీవుడ్ మూవీ 'స్పెషల్ 26' సినిమా విడుదల తర్వాత ప్రమోషన్లలో పాల్గొంటూనే ఇండోనేషియాలోని బాలి ప్రదేశానికి ఎంజాయ్ చేయడానికి వెళ్లింది.
అందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని తాజాగా బయటకు వచ్చాయి. ఇక్కడ కాజల్ సముద్ర తీరంలో గడుపుతూ, హోటల్ స్విమ్మింగ్ ఫూల్ లో స్విమ్ చేస్తూ, తనలోని ఫొటో గ్రఫీ కళకు పదును పెడుతూ, ఓ బుల్లి విమానంలో ఎక్కి తనకు నచ్చిన విధంగా తనివితీరా ఎంజాయ్ చేసింది.
ప్రస్తుతం కాజల్ జూ ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'బాద్ షా' చిత్రంతో లీడ్ హీరోయిన్ పాత్ర తో పాటు, రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'ఎవడు' చిత్రంలో ఓ చిన్న గెస్ట్ రోల్ చేస్తోంది. మరో వైపు త్వరలో కార్తి హీరోగా రూపొందబోయే మరో తమిళ చిత్రానికి కూడా కాజల్ హీరోయిన్‌గా ఎంపికయింది.

ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో సేదతీరుతున్న కాజల్.

తనలోని ఫోటో గ్రఫీ కళకు పదునుపెడూ... కెమెరా చేతపట్టిన కాజల్

అక్కడి హోటల్ రూములో స్విమ్మింగ్‌కు రెడీ అవుతున్న కాజల్.

బాలిలోని రిసార్టులో గుడుపుతున్న కాజల్.

బాలిలోని రిసార్టులో గుడుపుతున్న కాజల్.

బుల్లి విమానం ఎక్కి ఫోటోలకు ఫోజు ఇచ్చిన కాజల్.


Click it and Unblock the Notifications











