»   » ట్విట్టర్ లో ఫోటో.. కాజల్ అగర్వాల్ ఆంటీ అయిపోయిందిగా!

ట్విట్టర్ లో ఫోటో.. కాజల్ అగర్వాల్ ఆంటీ అయిపోయిందిగా!

Subscribe to Filmibeat Telugu
Kajal Aggarwal became 'Aunt'

మూడు పదుల వయసులో కూడా వయసులో కూడా చెదరని అందంతో దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ చంద్రబింబం లాంటి అందాలన్ని ఫిదా కాని వారంటూ ఉండరు. సౌత్ లో కాజల్ అగర్వాల్ గత దశాబ్దం నుంచి క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాంటి కాజల్ ఆంటీ అయిపోయింది. అదేమిటి అని అనుకుంటున్నారా.. కాజల్ ఆంటీ అయిపోయింది వయసు పరంగా కాదు. కాజల్ సోదరి, కొంతకాలం తెలుగులో హీరోయిన్ గా మెరిసిన నిషా అగర్వాల్ ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ రకంగా కాజల్ అగర్వాల్ ఆంటీ అయింది.

కాజల్ సోదరిగా సినిమాల్లోకి ఎంట్రీ

కాజల్ సోదరిగా సినిమాల్లోకి ఎంట్రీ

కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత నిషా అగర్వాల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏమైంది ఈ వేళ చిత్రం ద్వారా నిషా తెలుగు వెండి తెరకు పరిచయం అయింది.

ఏమైంది ఈ వేళ తొలిచిత్రం

ఏమైంది ఈ వేళ తొలిచిత్రం

నిషా ఏమైంది ఈ వేళ చిత్రంతో తొలి అవకాశాన్ని అందుకుంది. ఆ చిత్రంలో నిషా లుక్స్ ఆకట్టుకున్నాయి.

మరో మంచి అవకాశం

మరో మంచి అవకాశం

ఆ తరువాత నారా రోహిత్ సోలో చిత్రంలో నటించి మెప్పించింది. ఈ చిత్రంలో నిషా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

సినిమాలకు దూరం

సినిమాలకు దూరం

నిషాకు కొన్ని అవకాశాలు వచ్చినా ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీనితో క్రమంగా నిషా అగర్వాల్ కు ఛాన్సులు కరువయ్యాయి.

బిజినెస్ మాన్ తో

బిజినెస్ మాన్ తో

నిషా 2013 లో ముంబై కి చెందిన కరణ్ వలేచ అనే బిజినెస్ మాన్ ని వివాహం చేసుకుని రియల్ లైఫ్ లో సెటిల్ అయింది.

కాజల్ అలా ఆంటీ అయిపోయింది

కాజల్ అలా ఆంటీ అయిపోయింది

నిషా ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ అగర్వాల్ ఆ రకంగా ఆంటీ అయిపోయిందన్నమాట. పిల్లాడికి ఇషాన్ వలేచ అని పేరు కూడా పెట్టేశారు. తన సోదరి కొడుకు ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్ సంతోషంలో మునిగి తేలుతోంది.

English summary
Kajal Aggarwal become aunt now. Her sister Nisha Aggarwal has delivered a baby boy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu