నాలో ఉన్న మగాడికి హెల్ప్ చేయి.. కాజల్ తొలిసారి ఇలాంటి పాత్రలో!
కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం సీత. తేజ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నేనే రాజు నేనే మంత్రి చిత్రం తరువాత తేజ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో కథ మొత్తం కాజల్ అగర్వాల్ పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం. గత ఏడాది కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ కవచం చిత్రంలో జంటగా నటించారు. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి మంచి కమర్షియల్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా సీత చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. తేజ మార్క్ డ్రామా, కాజల్ అగర్వాల్ బోల్డ్ పెర్ఫామెన్స్ తో టీజర్ ఆకట్టుకునేలా ఉంది.

కాజల్ తొలిసారి
సీత అనే సాఫ్ట్ టైటిల్ పెట్టిన తేజ కాజల్ అగర్వాల్ పాత్రని మాత్రం చాలా బోల్డ్ గా చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా అర్థం అవుతోంది. ఉత్కంఠ భరిత సన్నివేశాలతో తేజ కాజల్ అగర్వాల్ పాత్రని హైలైట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాటి పవర్ ఫుల్ పాత్రలో కూడా కాజల్ అగర్వాల్ తన గ్లామర్ తో అదరగొడుతోంది. సోను సూద్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. టీజర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రని చాలా సరదాగా చూపించారు.

నాలో ఉన్న మగాడికి హెల్ప్ చేయి
తనికెళ్ల భరణి వైస్ ఓవర్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. భూవివాదాలకి సంబంధించిన సన్నివేశాలని చూపించారు. ఆ తర్వాత విలన్ గా సోనూసూద్ పాత్రని చూపించారు. నువ్వు నాలో ఉన్న మగాడికి హెల్ప్ చేయి.. పెళ్లి చేసుకుని అంటూ కాజల్ తో అంటాడు. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ ఆసక్తికరంగా ఉంది. ఈ పెళ్లి, పర్మనెంట్ అటాచ్మెంట్స్ నాకు వర్కౌట్ కాదు అని కాజల్ సమాధానం ఇస్తుంది. అయితే టెంపరరీ కమిట్మెంట్ అని సోనూసూద్ అంటాడు.. ఎన్ని రోజులు అంటూ కాజల్ బదులివ్వడంతో ఆమె పాత్ర ఎంత బోల్డ్ గా ఉండబోతోందో అర్థం అవుతోంది.
కంత్రీ పిల్ల
ఇంత కంత్రి పిల్లకు సీత అని పేరు పెట్టారు ఏంటా అనుకున్నాను.. పక్కనే శ్రీరాముడు ఉన్నాడు అనే విషయం అర్థం కాలేదు నాకు అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ గురించి తనికెళ్ళ భరణి చెప్పే డైలాగ్స్ బావున్నాయి. టీజర్ లో కొన్ని ఫన్నీ సన్నివేశాలు కూడా ఉన్నాయి. కాజల్ ఈ చిత్రంలో విలాసవంతమైన జీవితం గడిపే ధనవంతురాలిగా కనిపించబోతోంది.

ఎమోషనల్ సీన్స్
తేజ తనదైన శైలిలో బలమైన ఎమోషనల్ సీన్స్ ని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వేడి వేడి టీని కాజల్ బెల్లంకొండ ముఖాన కొడుతూ చచ్చిపో అని ఏడుస్తూ వెళ్ళిపోతోంది. ఈ టీజర్ ద్వారా తేజ కథ గురించి పెద్దగా రివీల్ చేయలేదు. కాజల్, బెల్లకొండ శ్రీనివాస్, సోనూసూద్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి మాత్రం చూపించాడు. మొత్తంగా సీత టీజర్ చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఉంది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











