కాజల్ బావలిద్దరూ బిగ్‌బాస్ విజేతలే.. శివబాలాజీ, కౌశల్ లక్కీగా..!
Recommended Video

తెలుగు వెర్షన్‌లో బిగ్‌బాస్ రియాలిటీ షో రెండు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా ముగిసాయి. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తే, రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహారించారు. మొదటి సీజన్‌లో శివబాలాజీ విన్నర్‌గా నిలిస్తే.. ఆదివారం ముగిసిన బిగ్‌బాస్ సీజన్‌లో కౌశల్ విజేతగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విజేతలిద్దరికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే..

కౌశల్, శివబాలాజీ ఇద్దరికి
బిగ్‌బాస్‌కు సంబంధించి గత రెండు సీజన్లలో విజేతలుగా నిలిచిన హీరోలు శివ బాలాజీ, కౌశల్‌కు ఓ కామన్ పాయింట్ ఉంది. వారిద్దరూ గతంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు బావలుగా నటించారు. కౌశల్ విజేతగా నిలిచిన ఈ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

చందమామ సినిమాలో
బిగ్‌బాస్ తెలుగు మొదటి విజేత శివబాలాజీ. చందమామ సినిమాలో కాజల్ అగర్వాల్, శివబాలాజీ కలిసి నటించారు. ఈ చిత్రంలో కాజల్‌కు బావ పాత్రలో శివబాలాజీ నటించారు. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో పాల్గొని విజేతగా నిలిచారు.

మిస్టర్ ఫర్‌ఫెక్ట్ చిత్రంలో
ఇక బిగ్‌బాస్ రెండో సీజన్ విజేత కౌశల్. దర్శకుడు దశరథ్ రూపొందించిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌లో కాజల్ అగర్వాల్, కౌశల్ కలిసి నటించారు. ప్రభాస్ నటించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌కు కౌశల్ బావగా నటించారు. తాజాగా బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు.

ట్రెండింగ్‌లో కాజల్ రిలేషన్
కాజల్ అగర్వాల్‌కు బిగ్‌బాస్‌తో సంబంధం లేకపోయిన ఈ విధంగా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం కాజల్-బాలాజీ, కాజల్-కౌశల్ ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. తదుపరి బిగ్‌బాస్ విజేత విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











