తన బోల్డ్ సీన్‌పై తొలిసారి స్పందించిన కాజల్.. అలా ఎందుకో చేసిందో చెప్పేసింది

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తమిళంలో నటించిన తాజా చిత్రం 'ప్యారిస్ ప్యారిస్'. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'క్వీన్' సినిమా రీమేక్‌గా ఇది తెరకెక్కింది. అక్కడ కంగన చేసిన పాత్రను తమిళంలో కాజల్ చేస్తోంది. ఇదే సినిమా తెలుగులో తమన్నా హీరోయిన్‌గా 'దటీజ్‌ మహాలక్ష్మి' పేరుతో తెరకెక్కింది. కన్నడంలో పరూల్‌మాధవ్‌ హీరోయిన్‌గా 'బటర్‌ఫ్లై' పేరుతోనూ, మలయాళంలో మంజిమామోహన్‌ హీరోయిన్‌గా 'జామ్‌జామ్‌' పేరుతో తెరకెక్కింది.

ఈ సినిమా దక్షిణాదిలోని నాలుగు భాషల్లో రూపొందింది. మీడియంట్‌ ఫిలిం పతాకంపై మనుకుమార్‌ వీటిని నిర్మించారు. త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు, కన్నడం, మలయాళం వెర్షన్లకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్లను ఇచ్చారు. కానీ, తమిళ వెర్షన్‌కు మాత్రం 'ఏ' సర్టిఫికెట్ జారీ చేశారు.

కాజల్ చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ అవ్వడంతో పాటు 25 వరకూ ఆడియో, వీడియో కట్స్‌ను ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్ రివైజింగ్‌ కమిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీడియాకు వెల్లడించారు. కమిటీ ఈ సినిమాను చూసిన తర్వాత ఏలాంటి నిర్ణయం ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Kajal Aggarwal clarity about bold scene

'ప్యారిస్ ఫ్యారిస్'లో బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయని టీజర్ చూస్తేనే అందరికీ అర్థం అయింది. అంతేకాదు, టీజర్‌లో కాజల్‌ బ్రెస్ట్‌ని మరో నటి ప్రెస్ చేయడం అప్పట్లో సంచలనమైంది. ఇందులో అలాంటి సీన్స్ ఇంకా ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విషయంలో జరుగుతున్న రాద్దాంతంపై కాజల్ తొలిసారి స్పందించింది.

తాజాగా దీనిపై ఓ చానెల్ ఆమెను ప్రశ్నించగా.. 'మా 'ప్యారిస్ ప్యారిస్'కు సెన్సార్ సమస్యలు వచ్చాయని తెలిసి ఆశ్యర్యపోయా. 'క్వీన్' ఎలా ఉందో తమిళంలో కూడా అలాగే తెరకెక్కించాం. అదనంగా ఏమి లేదు. మరి ప్రాబ్లెమ్ ఎక్కడ వచ్చిందో తెలియదు. నిర్మాతలు ఈ విషయమై రివైజింగ్ కమిటీకి వెళ్లారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి' అంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X