twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాతో వ్యాపారాలు చేయకండి.. తన ఎఫైర్‌పై వస్తున్న వార్తలపై కాజల్ సమాధానం ఇదీ.!

    By Manoj Kumar P
    |

    కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోందీ టాలీవుడ్ చందమామ. కల్యాణ్ రామ్ నటించిన 'లక్ష్మీ కల్యాణం' సినిమా ద్వారా చిత్ర సీమకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులోని దాదాపు అందరు హీరోలతో కలిసి నటించి మెప్పించింది. అంతేకాదు, ఇక్కడ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుని రికార్డులకు ఎక్కింది. ఇప్పుడు మాత్రం ఆమె పరిస్థితి ఏమంత బాగోలేదు. తాజాగా కాజల్.. తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే..

    అప్పుడు వరుస సినిమాలు.. ఇప్పుడు మాత్రం

    అప్పుడు వరుస సినిమాలు.. ఇప్పుడు మాత్రం

    ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అప్పుడు సీనియర్, జూనియర్ అనే తారతమ్యం లేకుండా ప్రాజెక్టులు చేస్తూ వచ్చింది. కానీ, ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు మినహా సినిమాలేవీ లేవు. అంతేకాదు, ఈమెకు హిట్ వచ్చి చాలా రోజులే అయింది.

    ఆఫర్లు లేకనే ఇలాంటి నిర్ణయం తీసుకుందా?

    ఆఫర్లు లేకనే ఇలాంటి నిర్ణయం తీసుకుందా?

    కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో వస్తున్న ‘మోసగాళ్లు' అనే సైబర్ నేపథ్యమున్న మూవీలోనూ నటిస్తోంది. అయితే, ఇందులో హీరోయిన్‌గా కాకుండా.. విష్ణుకు చెల్లెలిగా చేస్తోంది. ఆఫర్లు లేకనే కాజల్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది.

    పాపం కాజల్.. ఆమెకే ఈ కష్టాలు

    పాపం కాజల్.. ఆమెకే ఈ కష్టాలు

    ప్రస్తుతం చెప్పుకోదగ్గ ఆఫర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది కాజల్‌. అదే సమయంలో ఓ సినిమా ఆగిపోయి కూడా బాధ పడుతోంది. కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్' సినిమా దక్షిణాదిలో అన్ని భాషల్లో రీమేక్ చేశారు. మిగిలిన ఇండస్ట్రీల్లో రాని సమస్య కాజల్ నటించిన తమిళ వర్షన్ ‘పారిస్ పారిస్'కు మాత్రమే వచ్చింది. ఈ సినిమా సెన్సార్‌ను దాటలేకపోయింది.

    కాజల్ పెళ్లి చేసుకోబోతుంది

    కాజల్ పెళ్లి చేసుకోబోతుంది

    కొద్ది రోజులుగా కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఆమె ఓ వ్యాపారవేత్తతో రిలేషన్‌లో ఉందని, త్వరలోనే ఆయనతో పెళ్లి పీటలు ఎక్కబోతుందని అన్నారు. అందుకే కాజల్ అవకాశాలు వచ్చినా సినిమాలు చేయడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది.

    నాతో వ్యాపారాలు చేయకండి

    నాతో వ్యాపారాలు చేయకండి

    ఇటీవల ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన సమయంలో కాజల్‌కు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె.. ‘నా పెళ్లితో మీరు వ్యాపారాలు చేసుకోకండి. నాకు పెళ్లి కుదిరింది అనే వార్తల్లో నిజం లేదు. నేనెప్పుడు పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు మీ అందరికీ చెబుతాను' అంటూ ఫైర్ అయింది.

    English summary
    Has Kajal Aggarwal, who had confessed that she would marry soon recently, has apparently dropped a hint at her wedding? A picture posted by her on Instagram has paved way for the rumours of her marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X