Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ కారణం గానే ఆయన దూరమయ్యారు.. క్లారిటీ ఇచ్చిన కాజల్
దశాబ్ద కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతోంది కాజల్ అగర్వాల్. తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరపై కాలుమోపిన ఈ భామ పదేళ్ల కాలంలో అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. ఇప్పటికీ తన అందాలతో టాలీవుడ్ తెరకు కొత్త శోభ తీసుకొస్తోంది ఈ చందమామ. మరికొద్ది రోజుల్లో తన మొదటి సినిమా డైరెక్టర్ తేజతోనే సీత తో ప్రేక్షకుల ముందుకు రానున్న కాజల్.. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు విషయాలపై చర్చించింది. ఆ విశేషాలు చూస్తే..
సీత మూవీ గురించి
తన ప్రస్తుత సినిమా సీతపై చాలా కాన్ఫిడెన్స్‌తో ఉంది కాజల్. ఈ సినిమాలో తనది పవర్ ఫుల్ రోల్ అని, ఈ పాత్ర కోసం కెరీర్ లో ఇప్పటివరకూ పాడనీ కష్టాన్ని పడ్డానని అంటోంది కాజల్ అగర్వాల్. నేటితరం అమ్మాయిల జీవితాల్ని ప్రతిబింబించే కథే సీత అని పేర్కొంది కాజల్.
రూమర్స్‌పై క్లారిటీ
సీత ప్రమోషన్స్ లో భాగంగా తన తదుపరి సినిమాల గురించి కూడా ప్రస్తావించింది కాజల్. తెలుగులో శర్వానంద్‌తో ఒక సినిమాను అదేవిధంగా తమిళంలో జయం రవితో మరో సినిమాను పూర్తి చేశానని చెప్పింది కాజల్. ఇక 'భారతీయుడు 2' లో కమల్ సరసన నటిస్తున్న ఈ భామ.. ఆ సినిమా ఆగిపోయిందనే రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.
అందుకే కాస్త లేట్
'భారతీయుడు 2' ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం ఎంత మాత్రం నిజం కాదు. ప్రస్తుతం రాజకీయాలతో కమల్ హాసన్ బిజీగా ఉండటం వల్లనే షూటింగ్‌కి కాస్త దూరంగా ఉన్నారు. అందుకే లేట్ అవుతోంది, అంతేతప్ప సినిమా ఆగిపోలేదు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి మొదలు కానుంది. ఆ సినిమా షూటింగులో ఎప్పుడెప్పుడు పాల్గొంటానా అని ఎంతో ఆత్రుతగా వుంది అని కాజల్ చెప్పుకొచ్చింది.
అలాంటి సినిమాలే మరిన్ని చేస్తా..
తన కెరీర్ లో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యానంటోంది కాజల్. 'సీత' మాదిరిగా అలాంటి సినిమాలే మరిన్ని చేయాలనే ఆలోచన ఉందని కాజల్ ఈ సందర్బంగా పేర్కొంది. ఇక సీత మే 24 వ తేదీన విడుదల కానుంది.