రవితేజతో తేరీ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించిన కాజల్!
విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన 'తేరి' సూపర్ హిట్ కావడంతో ఆ చిత్రాన్ని తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్‌గా కేథరిన్ చేస్తోంది.
తాజాగా ఈ సినిమా గురించి కాజల్ ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో స్పందించారు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'తేరి' తెలుగు రీమేక్‌కు సైన్ చేసినట్లు తెలిపారు. కాజల్-రవితేజ కాంబినేషన్లో చివరగా 'సారొచ్చారు' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

'తేరీ' తెలుగు రీమేక్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
కాజల్ ప్రస్తుతం తమిళంలో 'పారిస్ పారిస్' చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్ మూవీ క్వీన్ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. మనుకుమారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











