»   » ఆ సినిమాలో కాజల్ ఐటం సాంగ్? పరువు పోవడం ఖాయం!

ఆ సినిమాలో కాజల్ ఐటం సాంగ్? పరువు పోవడం ఖాయం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాప్ హీరోయిన్లు కూడా ఐటం సాంగులు చేయడం అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఇప్పటికే తమన్నా, శృతి హాసన్, శ్రీయ లాంటి వారు ఐటం పలు సినిమాల్లో సాంగులు చేసి అదగరొట్టారు. ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఐటం సాంగులు చేసే హీరోయిన్ల లిస్టులో చేయడానికి మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నటి అంజలి హీరోయిన్‌గా 'గీతాంజలి' అనే హారర్ అండ్ కామెడీ చిత్రం తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈచిత్రంలో ఓ స్పెషల్ సాంగు చేయాలని ఆ చిత్ర నిర్మాతలు కాజల్‌ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు మాత్రం నమ్మశక్యంగా లేవనేది పలువురి అభిప్రాయం.

 Kajal Aggarwal to do item song

ఒక వేళ సంప్రదించిన మాట వాస్తవమే అయినా కాజల్ అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని అంటున్నారు. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న అంజలి సినిమాలో ఐటం సాంగు చేయడం, అందులోనూ బ్రహ్మానందంతో అంటే ఆమె వ్యాల్యూ పడిపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఏ మహేష్ బాబో, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలైతే పర్వాలేదు కానీ....మరీ ఈ చిన్న సినిమాలో ఐటం సాంగ్ చేయడం ఆమె కెరీర్‌కు నష్టమే అనేది పలువురి అభిప్రాయం.

ఇక 'గీతాంజలి' సినిమా విషయానికొస్తే...
హర్రర్, హాస్య కధాంశంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎం‌వి‌వి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర కథను ప్రముఖ రచయిత కోన వెంకట్ సమకూర్చారు. ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకుడిగా, శ్రీజో గేయ రచయితగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, హర్ష వర్దన్ రాణె, రావు రమేశ్, అలీ, రఘుబాబు, పృథ్వీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్, శ్రవణ్, మధునందన్, సీవీఎల్ నరసింహారావు, దీక్షితులు నటిస్తున్నారు.

English summary
The makers of the Anjali-starrer Geethanjali have approached Kajal to do a special number in the film. This is contrary to rumours that Samantha has been approached for the same number.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu