వ్యాపారవేత్తతో కాజల్ అగర్వాల్ వివాహం.. పెళ్లి తర్వాత దిమ్మతిరిగే ప్లాన్స్‌తో బ్యూటీ

దశాబ్దం కాలానికి పైగా కాజల్ ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోయిన్లకు ధీటుగా పోటీనిస్తూ భారీ ప్రాజెక్టులను సొంతం చేసుకోవడం ఆమె ప్రొఫేషనలిజానికి ఓ మచ్చు తునకగా చెప్పుకొంటారు. అయితే ప్రతీ హీరోయిన్‌కు సాధారణంగా వచ్చే డేటింగ్, అఫైర్ల రూమర్లను తనపై రాకుండా జాగ్రత్తపడుతుంటారు. కానీ ఇటీవల కాలంలో కాజల్‌పై డేటింగ్, పెళ్లి గురించి వార్తలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. కాజల్ డేటింవగ్, పెళ్లి గురించి వినిపిస్తున్న వార్త ఏమిటంటే..

Recommended Video

Kajal Aggarwal Wax Statue At Madame Tussauds Singapore
లాక్‌డౌన్‌లో పెళ్లిపై ధ్యాస

లాక్‌డౌన్‌లో పెళ్లిపై ధ్యాస

ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే యువ నటీనటులకు పెళ్లి అంటే పట్టింపు ఉండేది కాదు. లాక్‌డౌన్‌లో బీజీ లైఫ్‌కు దూరంగా ఉండటం, ఒంటరి జీవితం గడపడటంతో తోడు గురించి యావ పెరిగినట్టు కచ్చితంగా స్పష్టమవుతున్నది. నిఖిల్, రానా, నిహారిక పరిస్థితి చూస్తే అదే అర్ధమవుతున్నది. తాజాగా ఆ లిస్టులో కాజల్ కూడా చేరబోతున్నదనే వార్త గట్టిగానే వినిపిస్తున్నది.

వ్యాపారవేత్తతో

వ్యాపారవేత్తతో

కొద్దికాలంగా కాజల్ తన ఫ్యామిలీ సర్కిల్‌లో ఒకరితో డేటింగ్ చేస్తున్నారనే విషయం చూచాయగా తెలియజేసింది. ఆ మధ్యలో ఒకరితో లవ్లీ మూమెంట్స్ షేర్ చేసుకొంటున్నట్టు ఓ ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసి డేటింగ్ వార్తలకు జోష్ పెంచారు. ఇటీవల తన ఫ్రెండ్స్‌తో కలిసి బాయ్‌ఫ్రెండ్‌తో టూర్‌కు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి.

పెళ్లికి ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్

పెళ్లికి ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్

అయితే తన డేటింగ్ చేస్తున్నది ముంబైలోని ఓ వ్యాపారవేత్తతో అనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది. కొద్దికాలంగా వారి మధ్య కొనసాగుతున్న ఆఫైర్ ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. అందుకు తన తల్లి దండ్రుల అంగీకారం కూడా పెళ్లి లైన్ క్లియర్ చేసిందనే వార్తలు వచ్చాయి.

సినీ నిర్మాతగా అవతారం..

సినీ నిర్మాతగా అవతారం..

అయితే తన ప్రియుడితో పెళ్లి కుటుంబ సభ్యుల ఆమోదం తెలియజేయడంతో కాజల్ వివాహానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. పెళ్లి తర్వాత సినీ నిర్మాతగా మారి మూవీ నిర్మాణంపై దృష్టిపెట్టాదలని, అలాగే తన భర్తతో కలిసి వ్యాపారంలో భాగస్వామ్యం కావాలనే ప్రణాళికను రచిస్తున్నట్టు ఆమె పీఆర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పెళ్లికి ముందే సినిమాలు పూర్తి చేసే ఆలోచనలో

పెళ్లికి ముందే సినిమాలు పూర్తి చేసే ఆలోచనలో


అంతేకాకుండా పెళ్లికి ముందే తాను అంగీకరించిన ప్రాజెక్టులు పూర్తి చేసే ఆలోచనలో కాజల్ ఉన్నారు. పెళ్లి ఏర్పాట్లు జరిగే లోపే నటనకు దూరంగా అవ్వాలనే ప్లాన్ చేసుకొంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. క్వీన్ రీమేక్ పారిస్ పారిస్, మోసగాళ్లు, ఆచార్య, ముంబై సాగా, హే సినామిక, ఇండియన్ 2 చిత్రాలను చేయాల్సి ఉన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X