For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాపై తప్పుడు ప్రచారం..నమ్మొద్దు : కాజల్ (ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: నాపై ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా గురించి వస్తున్న రూమర్స్ ని ఎవరూ నమ్మొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తోంది కాజల్. దీపావళికి విడుదలైన 'తుపాకి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం దీనిని హిందీలోకి రీమేక్‌ చేస్తున్నాడు దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌. అక్షయ్‌కుమార్‌ హీరో. హీరోయిన్ గా కాజల్‌ పేరు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని కాజల్‌ కొట్టిపారేస్తూ ఆమె ఇలా స్పందించింది. ఈ ఏడాది సూర్య సరసన 'బ్రదర్శ్‌', విజయ్‌తో 'తుపాకి' చిత్రాల్లో నటించి తమిళ,తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన హీరోయిన్ కాజల్‌. ఒక సినిమా కాస్త నిరాశ పరిచినా.. రెండోది మాత్రం అమ్మడి స్థాయిని నిలిపింది.

  హీరోయిన్స్ పై రూమర్స్ రావటం, ఆ తర్వాత వాళ్లు ఖండిచటం చాలా కాలంగా జరుగుతున్నదే. అయితే ఈ సారి మాత్రం కాజల్ కాస్త ఘాటుగానే సీరియస్ గా మాట్లాడింది. దానికి కారణం.. తుపాకి చిత్రం షూటింగ్ సమయంలో నిర్మాత ఆమె పై విరుచుకు పడటం అంటున్నారు. మురుగదాస్ సైతం ఆమె వల్లే షూటింగ్ లేటైందటూ నర్మగర్భంగా విమర్శలు చేయటం కూడా ఆమె కోపానికి కారణం అంటున్నారు.

  తుపాకి హిందీ రీమేక్‌లో నటించట్లేదు. ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలా నా గురించి వస్తున్న వదంతులను ఎవరూ నమ్మొద్దు. ఆ సినిమా కోసం ఎవరూ నన్ను సంప్రదించలేదు. నేను అంగీకరించినట్లు ఎవరో కథలు అల్లుతున్నారు. ఇదివరకే అక్షయ్‌కుమార్‌తో 'స్పెషల్‌ సాబీస్‌'లో కనిపించాను

  తుపాకి ఓ యాక్షన్ థిల్లర్ చిత్రం. మురగదాస్ డైరక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో మంచి విజయం సాధించింది. కాజల్, విజయ్ నటించిన ఈ చిత్రం టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందింది.

  ఈ చిత్రంలో పరిణితి చోప్రా ని హీరోయిన్ గా తీసుకుంటారని బాలీవుడ్ మీడియాలో నలుగుతోంది.

  అయితే కాజల్ పాత్రకు గానూ కత్రినా కైఫ్,దీపికా పదుకోని,సోనాక్షి సిన్హా ని సైతం సంప్రదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం

  కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సారొచ్చారు,నాయక్,బాద్షా,ఎవడు చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

  లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత... ప్రముఖ భారత క్రీడాకారిణి మేరీ కోమ్ ప్రేరణతో కాజల్ పాత్రను రూపొందించారు. ఈ చిత్రంలో ఆమె భాక్సర్ గా కనిపించింది. ఈ విషయమై మీడియాతో ఆమె మాట్లాడుతూ... "నేను ఈ చిత్రంలో భాక్సర్ గా కనిపించాను. ఆ ఎక్సపీరియన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నన్ను నేను భాక్సర్ గా తెర మీద చూసుకోవటం చాలా ఆనందపరిచే విషయం," అంది.

  ప్రస్తుతం కాజల్ తెలుగులో చేసిన సారొచ్చారా చిత్రం పైనే అందరి దృష్టీ ఉంది. రవితేజ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని పరుసరామ్ డైరక్ట్ చేసారు. ఈచిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రై.లి.పై నిర్మిస్తున్నారు.

  English summary
  The actress Kajal has denied the rumours and claimed that she has not signed the project. Speaking to a daily, Kajal Aggarwal, who has paired up with Akshay Kumar in forthcoming Hindi movie Special Chabbis, has said that she has not been offered the Thuppakki remake. According to her, she does not think the makers even considered her to pair up with Akki in the Hindi version, and nobody has approached her about the forthcoming Hindi film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X