కాజల్ ఇంట సంబరాలు.. మొత్తానికి రెడీ అయింది.. ఆ కార్యానికి ముహూర్తం ఫిక్స్
సౌత్ ఇండియన్ సినీ తెరపై కాజల్ స్థానం ఎంతో ప్రత్యేకమైంది. గత పన్నెండేళ్ళుగా సినిమాలు చేస్తూ దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తోంది ఈ లేడీ బ్యాచిలర్. అయితే తాజాగా అందిన సమాచారం ఆమె అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ అప్‌డేట్ తెలిసి సంబరాలు చేసుకుంటున్నారు కాజల్ ఫ్యాన్స్. ఇంతకీ అందరినీ అంతలా ఆకట్టుకుంటున్న ఆ అప్‌డేట్ ఏంటంటారా? వివరాల్లోకి పోతే..

ఇటీవలే హాఫ్ సెంచరీ.. అయినప్పటికీ అదే జోరు
తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో భారీ పాపులారిటీ తెచ్చుకోవడమే గాక తనకంటూ లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించుకుంది. దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే 50 సినిమాల మార్క్ కూడా దాటేసి హవా సాగిస్తోంది. దీంతో దశాబ్దకాలంగా ఈమె పేరు సౌత్ ఆడియన్స్ నోళ్ళలో నానుతూ వస్తోంది.

వరుస ఆఫర్స్.. భారీ హిట్స్
తేజ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్.. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో అందరికీ మదిలో చిరస్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ పలకరించి భారీ హిట్స్ ఆమె ఖాతాలో వేశాయి.

సింగపూర్‌లో కాజల్ ప్రతిరూపం
ఇకపోతే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు కాజల్ అగర్వాల్ విగ్రహాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఆమె కొలతలు కూడా తీసుకున్నారు. ఈ విగ్రహాన్ని సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు.

సంబర పడుతున్న కాజల్ అగర్వాల్.. ముహూర్తం ఫిక్స్
అయితే ఈ కాజల్ మైనపు విగ్రహం పనులు పూర్తికావడంతో సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె విగ్రహం ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 5వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీంతో ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సహా ఆమె కుటుంబమంతా తెగ సంబరపడి పోతోంది.

తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్.. రికార్డ్
ఆ రోజుతో సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా కాజల్ రికార్డు నెలకొల్పనుంది. ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు, ప్రభాస్, కాజోల్, కరీనా కపూర్ విగ్రహాలు ఉన్నాయి.

కాజల్ సినీ జర్నీ
ఇక ఈ మధ్యకాలంలో కాజల్ తన సినీ జీవితాన్ని కాస్త స్లో చేసేసింది. ప్రస్తుతం కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో 85 ఏళ్ల ముసలమ్మ పాత్రలో ఆమె నటిస్తుండటం విశేషం. అలాగే మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంలో కూడా నటిస్తోంది కాజల్.


Click it and Unblock the Notifications











