సిసిఎల్-2 ప్రచార కర్తగా కాజల్
సిసిఎల్-2 ప్రచార కర్త(బ్రాండ్ అంబాసిడర్)గా కాజల్ అగర్వాల్ అవకాశం దక్కించుకుంది. గత సీజన్లో కాజల్ కు చోటు దక్కలేదు. తాజాగా సిసిఎల్ లో కేరళ, పశ్చిమబెంగాల్ సినిమా టీంలు కూడా చేరడంతో నిర్వాహకులు సీసీఎల్ కు మరింత గ్లామర్ ను చేర్చాలని నిర్ణయించారు. అందులో భాగంగానే కాజల్ తాజా ఎంపిక జరిగింది. ఇప్పటికే శ్రియ, ప్రియమణి, దీక్ష సేథ్, మాధురి భట్టాచార్య, పాయల్ సర్కార్ సిసిఎల్ ఆర్గనైజింగ్ కమిటీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఇప్పుడువీరి సరసన కాజల్ కూడా చేరింది.
రీచా, జెనీలియా, చార్మి, కంగనా, సోనాక్షి, అమలా పాల్, సమీరా రెడ్డి, లక్ష్మిరాయ్, భావన, నిధి సుబ్బయ్య తదితరులు సపరేట్ టీమ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. జనవరి 13న ప్రారంభం కానున్న సిసిఎల్-2 టోర్నమెంటులో భాగంగా తెలుగు వారియర్స్, ముంబై హీరోస్ మద్య తొలి మ్యాచ్ జరుగనుంది.
ప్రస్తుతం కాజల్ తన తాజా సినిమా బిజినెస్ మేన్ రిలీజ్ పై ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గతంలో కాజల్ నటించిన మగధీర చిత్రం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలవడం, తాజాగా బిజినెస్ మేన్ సినిమా కూడా అసినిమా రేంజ్ ను అందుకుంటుందనే రేంజ్ లో ప్రచారం జరుగుతుండటంతో చాలా ఎక్సైటెడ్ గా ఉంది. గత సంవత్సరం వీర, దడ ప్లాపులతో కాస్త వెనక పడ్డ కాజల్ ఈ సినిమా హిట్టయితే పూర్వ వైభవాన్ని సంతరించుకుని ఈ యేడు టాప్ హీరోయిన్‌గా తన హవా కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











