పవన్ కళ్యాణ్‌తో అలా అనిపించింది కానీ చిరుతో.. ఆ సీన్స్ సూర్యతో అలా కానిచ్చేశానన్న కాజల్
టాలీవుడ్ చందమామ.. కలువ కళ్ల భామ కాజల్ అగర్వాల్ తాజాగా మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తోన్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే షోలో పాల్గొంది. ఇప్పటికే ఈ షోలో నిధి అగర్వాల్, నిఖిల్, సమంత, శ్రుతీ హాసన్, వరుణ్ తేజ్ లాంటి సెలబ్రిటీలు పాల్గొని ఎన్నో రహస్యాలను బహిర్గతం చేశారు. తాజాగా కాజల్ అగర్వాల్ తనకు సంబంధించిన విషయాలను వెల్లడించింది.

అలాంటివి నచ్చవు..
తనకు సినిమాల్లో ముద్దు పెట్టుకునే సన్నివేశాలైనా, బికినీ ధరించే సీన్స్ అయినా, టాప్ లెస్ సీన్లు అయినా నచ్చవని చెప్పుకొచ్చింది. అలాంటి సీన్లలో నటించిన సంఘటనలు గుర్తు చేస్తూకుంటూ.. దో లఫ్జోంకీ కహాని చిత్ర షూటింగ్ విషయాలను గుర్తుకు తెచ్చుకుంది. తనకు ఇప్పటికీ అలాంటి సీన్స్ అంటే నచ్చవని చెప్పుకొచ్చింది.

సూర్యతో అలా కానిచ్చేశాను..
కేవీ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన బ్రదర్స్ సినిమాలో సూర్య, కాజల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ రొమాంటిక్ సీన్ గురించి చెప్పుకొస్తూ.. తనకు, నాకు కిస్ సీన్ నచ్చలేదని, సూర్య కూడా వద్దని చెప్పినట్టు గుర్తు చేసుకుంది. అయితే దర్శకుడు మాత్రం వదల్లేదని చెప్పుకొచ్చింది. దీంతో తామిద్దరం ఒక బొమ్మను ముద్దుపెట్టుకున్నామని.. సినిమాలో ఎడిట్ చేసి మీకు అలా చూపించారని అసలు విషయం బయట పెట్టేసింది.

పవన్ కళ్యాణ్‌తో అలా అనిపించింది..
పవన్ కళ్యాణ్‌తో చాలా క్లోజ్ అనే ఫీలింగ్ అనిపించింది కానీ ఇంకెవ్వరితోనూ అలాంటి ఫీలింగ్ రాలేదు... చిరంజీవితో కూడా అలా అనిపించలేదు. అయితే ఎందుకు అనే విషయం మాత్రం తనకు తెలీదంటూ చెప్పుకొచ్చింది. పడుకునే ముందు తన పక్కన ఓ పుస్తకం, అద్దాలు, వాటర్ బాటిల్, శివుని బొమ్మ ఉండాలంటూ తన సీక్రెట్లను రివీల్ చేసింది.


Click it and Unblock the Notifications











