»   » జయలలిత నేను కాదంటున్న కాజల్ అగర్వాల్!

జయలలిత నేను కాదంటున్న కాజల్ అగర్వాల్!

Subscribe to Filmibeat Telugu

చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటికీ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. కాజల్ అందం ఇప్పటికి అభిమానులని ఆకట్టుకుంటుండడంతో పలు చిత్రాల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. కాజల్ ఇటీవల ఎమ్మెల్యే చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెరిసింది. పలు చిత్రాల్లో నటిస్తోంది.

ఇటీవల కాజల్ అగర్వాల్ కు సంబంధించిన ఆసక్తిక రవార్త ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తేజ దర్శత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం వైభవంగా ప్రారంభం అయింది.

Kajal Aggarwal opens up about NTR biopic

ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చందమామ కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కాజల్ నటించబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు అవాస్తవమని కాజల్ తెలిపింది. ఎన్టీఆర్ బయోపిక్ లో తాను నటించడం లేదని తెలిపింది. ఏఈ చిత్ర నటీనటులు గురించి అధికారిక ప్రకటన రాకపోయినా క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో పలు రూమర్లు వినిపిస్తున్నాయి.

English summary
Kajal Aggarwal opens up about NTR biopic. She responds on her rumours
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X