'కాట్రవర్సీ ముద్దు'పై కాజల్ రియాక్షన్.. చోటా కె నాయుడు గురించి ఏం చెప్పిందంటే!

Recommended Video

Chota K Naidu Finally Responds On Kajal Kissing Issue

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం కవచం. డిసెంబర్ లో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంగతి హాట్ టాపిక్ గా మారింది. పెద్ద వివాదాన్ని సృష్టించింది. శ్రీనివాస్ మామిళ్ళ ఈ చిత్రానికి దర్శకుడు. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ లాంచ్ లో కాజల్ అగర్వాల్ మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు అసభ్యకర ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. ఈ వివాదం కాజల్ అగర్వాల్ తొలిసారి స్పందించింది.

 ముద్దు వివాదం

ముద్దు వివాదం

కాజల్ అగర్వాల్ ప్రసంగిస్తున్న సమయంలో చోటా కె నాయుడు ఒక్కసారిగా ఆమెకు ముద్దు పెట్టేశాడు. ఆ సందర్భంగాలో అంతా దీనిని సరదాగా భావించారు. కానీ సోషల్ మీడియాలో సైతం చోటాపై పెద్దఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. చోట కె నాయుడు గత విడియోలని నెటిజన్లు బయటకు తీసు దుయ్యబట్టడం మొదలుపెట్టారు.

సౌందర్య పేరు చెప్పి

సౌందర్య పేరు చెప్పి

ఈ ఘటనతో చోటా కె నాయుడు దిగిరాక తప్పలేదు. ఈ వివాదంపై స్పందిస్తూ క్షమాపణలు కోరారు. కానీ తాను కాజల్ అగర్వాల్ ని తప్పుడు ఉద్దేశంతో ముద్దు పెట్టుకోలేదని అన్నారు. సౌందర్య తరువాత నేను అంతగా ఇష్టపడే నటి కాజల్ అగర్వాల్. ఆమెపై నాకు ప్రత్యకమైన అభిమానం ఉంది. మేము కుటుంబ సభ్యులలాగే ఉంటాం అని చోటా తెలిపారు. దీనితో వివాదం సద్దుమణిగింది.

 తొలిసారి కాజల్

తొలిసారి కాజల్

ఈ సంఘటన జరిగిన తరువాత కాజల్ అగర్వాల్ తొలిసారి స్పందించింది. చోట కె నాయుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్. నా కెరీర్ ఆరంభం నుంచి ఆయన నన్ను ప్రోత్సహిస్తున్నారు. కవచం ఆడియో టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన చేసింది నాకు తప్పుగా అనిపించలేదు అని తెలిపింది. ముద్దు వివాదం గురించి పదే పదే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాజల్ తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

 క్రేజీ ఆఫర్స్

క్రేజీ ఆఫర్స్

ఇండస్ట్రీలోకి కుర్ర హీరోయిన్లు ఎంతమంది వస్తున్నా కాజల్ అగర్వాల్ కు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. శంకర్ భారతీయుడు 2 చిత్రంలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. తమిళంలో జయం రవి సరసన మరో చిత్రంలో నటిస్తోంది. చోట కె నాయుడు గురించి కాజల్ చేసిన వ్యాఖ్యలు వివాదం మరింత పెద్దది కాకుండా చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X