స్టార్ క్రికెటర్ ప్రేమలో కాజల్ అగర్వాల్.. ఇన్నిరోజులు సీక్రెట్‌గా!
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాలని ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది. సౌత్ లో కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనసవసరం లేదు. దాదాపుగా సౌత్ స్టార్ హీరోలందరితో కాజల్ సినిమాలు చేసింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. మరోవైపు కాజల్ క్వీన్ తమిళ రీమేక్ లో కూడా నటిస్తోంది. చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, రూమర్లు సహజజమే. కానీ వీటన్నింటికి కాజల్ దూరంగా ఉంటుంది. కానీ తాజా జీవితంలో కూడా ప్రేమ కథ ఉందని కాజల్ చెబుతోంది.

క్రికెటర్‌పై మనసుపడ్డా
ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీ జీవితంలో ఎప్పుడూ ఎవరితోనూ ప్రేమలో పడలేదా అని అడగగా.. ఓ స్టార్ క్రికెటర్ పై తాను తొలిసారి మనసు పడ్డానని కాజల్ ప్రకటించింది. కానీ కాజల్ ఆ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ క్రికెటర్ కు ఇప్పటికే వివాహం జరిగిపోయింది. అతడెవరో కాదు టీంఇండియా హిట్ మాన్ రోహిత్ శర్మ.

వీరాభిమానిని
కాజల్ అగర్వాల్ మాట్లాతూ.. రోహిత్ శర్మపై మనసుపడడమే కాదు.. అతడి ఆటకు నేను వీరాభిమానిని. రోహిత్ ఎప్పుడు ఆడుతున్నా ఆ మ్యాచ్ మిస్ కాకుండా చూస్తుంటా అని కాజల్ అగర్వాల్ తెలిపింది. క్రికెట్ ఆటలో అతడి నైపుణ్యం తనని మెస్మరైజ్ చేస్తుందని కాజల్ అగర్వాల్ అభిప్రాయపడింది. కాజల్ అగర్వాల్ సౌత్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంటే.. రోహిత్ శర్మ టీం ఇండియాలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. రోహిత్ శర్మపై తన ఇష్టాన్ని ఇన్నిరోజులు నా మనసులోనే రహస్యంగా దాచుకున్నానని కాజల్ తెలిపింది.

యంగ్ హీరోతో రెండోసారి
కాజల్ అగర్వాల్ చివరగా నటించిన చిత్రం కవచం. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరో. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ అదే హీరోతో సీత చిత్రంలో నటిస్తోంది. నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని మించి సీత విజయం సాధిస్తుందనే ధీమాని కాజల్ వ్యక్తపరుస్తోంది. ఇక శర్వానంద్ సరసన కూడా కాజల్ ఓ చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది కాజల్ నటించిన అ! చిత్రం విజయం సాధించినా ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్యే, కవచం చిత్రాలు నిరాశపరిచాయి.

భారీ చిత్రంలో
ఇక కాజల్ అగర్వాల్ ఓ భారీ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందబోయే భారతీయుడు 2లో కాజల్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. కానీ ఈ చిత్ర పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. అనుకోని కారణాల వలన భారతీయుడు ఆగిపోయిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కాజల్ బాలీవుడ్ లో నటించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











