అదంతా తప్పు.. ప్రభాస్ ఎలా ఉంటారంటే.. కాజల్ చూడండి ఎలా మాట్లాడుతుందో!
దశాబ్ద కాలానికి పైగా అందాల తారగా అలరిస్తూ వస్తోంది కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లోని అందరు అగ్ర హీరోలతో ఆడిపాడిన ఈ భామ ఇప్పటికే తన కెరీర్ లో 50 సినిమాల మైలురాయిని కూడా దాటేసింది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్‌గా కొనసాగుతూ వరుస సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికరంగా స్పందించింది కాజల్. వివరాల్లోకి పోతే..
Recommended Video

సాహో.. బ్యాడ్ బాయ్
ఇటీవలే ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సాహో' సినిమాలో బ్యాడ్ బాయ్ సాంగ్ ఎంతలా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బ్యాడ్ బాయ్' అంటూ సాగిపోయిన ఈ స్పెషల్ సాంగ్ థియేటర్లను హోరెత్తించింది. ఇందులో ప్రభాస్ తో కలిసి శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చిందులేసింది. దీంతో ఈ సాంగ్
సినిమాలో హైలైట్‌గా నిలిచింది.

ముందుగా కాజల్ అనుకున్నారు.. కానీ
కాగా సాహోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఈ బ్యాడ్ బాయ్ కోసం ముందుగా కాజల్ అగర్వాల్‌ని తీసుకోవాలనుకున్నారట. కానీ చివరి క్షణంలో కాజల్‌ని కాదని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫైనల్ చేశారనే వార్తలు వచ్చాయి. దీంతో ప్రభాస్, సాహో యూనిట్ పై కాజల్ అగర్వాల్ అలిగిందని కూడా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఇదే అంశంపై కాజల్ స్పందించింది.

ఆ ఇద్దరూ కలిస్తే ప్రభాస్
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా కాజల్ మాట్లాడుతూ.. బ్యాడ్ బాయ్ సాంగ్ విషయంలో వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని తేల్చేసింది. అంతేకాదు ప్రభాస్ గురించి స్పందిస్తూ హాలీవుడ్ సూపర్ హీరోస్, మార్వెల్ క్యారెక్టర్స్ ఐరన్ మ్యాన్, హల్క్ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ అలా ఉంటాడంటూ కామెంట్ చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాజల్ డ్రెస్సింగ్‌సెన్స్‌పై ప్రభాస్
గతంలో ఓ సారి కాజల్ గురించి ప్రభాస్ కూడా స్పందించారు. కాజల్‌లో పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్ ఏంటనే విషయంలో ఆయన స్పందిస్తూ.. అందం, ఎనర్జిటిక్‌గా ఉండడం కాజల్ ప్లస్ పాయింట్స్ అన్నారు. ఒకప్పుడు కాజల్ డ్రెస్సింగ్‌సెన్స్ యావరేజ్‌గా ఉండేదని అదొక్కటే ఆమెలో నెగెటివ్ తప్ప ఇంకేమీ లేదని చెప్పారు. 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాల్లో ప్రభాస్, కాజల్ కలిసి నటించారు.

ప్రభాస్ సాహో
ఇక ప్రభాస్ తాజాగా సినిమా సాహో విషయానికొస్తే.. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన మేర రాణించనప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఆగష్టు 30న విడుదలైన ఈ సినిమా 500 కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ హీరోయిన్‌గా నటించింది. ప్రభాస్ నటన, నిర్మాణ విలువలు ప్రేక్షకుల మెప్పు పొందాయి.


Click it and Unblock the Notifications











