Don't Miss!
- News ఏకగ్రీవంగా సికింద్రాబాద్.. మోడీ-అమిత్ షా గేమ్ ప్లాన్?
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తనకు తాను ఫ్రెంచ్ హాలిడేస్ ప్రకటించుకొన్న కాజల్..!
తెలుగులో దాదాపు టాప్ స్ధాయికి చేరుకున్నహాట్ హీరోయిన్ కాజల్ త్వరలో ప్యారిస్ వెళ్ళనుంది. అయితే ఈ ట్రిప్ షూటింగ్ కోసం కాదట...విశ్రాంతి కోసమని చెప్తోంది.ఆమె మాట్లాడుతూ... వరుస సినిమాలతో అలసిపోయాను. నాలుగేళ్లలో 21 సినిమాల్లో నటించాను. ఎక్కడా విరామం తీసుకోలేదు. మనసు, శరీరం కాస్త విశ్రాంతి కోరుకొంటున్నాయి. ఎక్కడా గ్యాప్ లేకపోవడంతో టీన్ అయిపోయి, లైఫ్ బోర్ కొట్టేస్తోంది. అందుకే, ఇప్పుడు వీలుచూసుకుని, ఓ వారం రోజుల పాటు నా స్నేహితులతో కలిసి పారిస్ వెళ్తున్నాను. ఒక వారం అక్కడ ఆనందంగా గడిపి మరో ఏడాది షూటింగ్ లలో పాల్గొనడానికి అవసరమైన శక్తిని నింపుకొని వస్తాను అంది.
అలాగే ఇటీవల నేను నటించిన 'సింగం' సినిమా బాలీవుడ్లో మంచి పేరు తీసుకొచ్చింది. హిందీ అవకాశాలు చాలానే వస్తున్నాయిగానీ ప్రస్తుతానికి ఏవీ ఒప్పుకోలేదు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన 'ది బిజినెస్ మేన్' చిత్రాన్ని అంగీకరించాను. 'సింగం'తో విజయాన్ని అందుకొన్న తరవాత విహార యాత్రకు వెళ్లడం మరింత ఆనందాన్నిస్తోందని చెప్పుకొచ్చింది. ఇక ఆమె రీసెంట్ చిత్రం 'దడ' భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.